Gold Smuggling: అక్రమంగా గోల్డ్ స్మగ్లింగ్ చేసేందుకు యత్నం.. నిందితులకు షాక్ ఇచ్చిన అధికారులు

| Edited By: Aravind B

Aug 27, 2023 | 8:34 AM

విజయవాడలో భారీగా బంగారం పట్టుపడడం కలకలం రేగింది. పెద్దమొత్తంలో అక్రమ బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న రూ.6.4 కోట్ల విలువైన బంగారాన్ని విజయవాడ కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ కస్టమ్స్ (ప్రివెంటివ్) కమిషనరేట్ అధికారులు.. దుబాయ్, శ్రీలంక మూలాలకు చెందిన స్మగ్లింగ్ బంగారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోకి తరలిస్తున్న కేసును ఛేదించారు.

Gold Smuggling: అక్రమంగా గోల్డ్ స్మగ్లింగ్ చేసేందుకు యత్నం.. నిందితులకు షాక్ ఇచ్చిన అధికారులు
Gold
Follow us on

విజయవాడలో భారీగా బంగారం పట్టుపడడం కలకలం రేగింది. పెద్దమొత్తంలో అక్రమ బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న రూ.6.4 కోట్ల విలువైన బంగారాన్ని విజయవాడ కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ కస్టమ్స్ (ప్రివెంటివ్) కమిషనరేట్ అధికారులు.. దుబాయ్, శ్రీలంక మూలాలకు చెందిన స్మగ్లింగ్ బంగారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోకి తరలిస్తున్న కేసును ఛేదించారు. ఇక వివరాల్లోకి వెళ్తే శనివారం తెల్లవారుజామున బొల్లాపల్లి టోల్ ప్లాజా దగ్గర విజయవాడ కస్టమ్స్ (ప్రివెంటివ్) కమిషనరేట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. చెన్నార్ నుండి విజయవాడకు కారులో తరలిస్తున్న స్మగ్లింగ్ బంగారం క్యారియర్‌ను అడ్డగించారు. దాదాపు 4.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ గుర్తు పట్టకుండా ఉండేందుకు బంగారంపై ఉన్న విదేశీ గుర్తులను ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు అధికారులు గుర్తించారు. దీనికి కొనసాగింపుగా అధికారులు క్యారియర్‌లో సోదాలు నిర్వహించారు. చివరికి అందులో బంగారు ఆభరాణలు ఉడంటాన్ని గుర్తించారు.

విదేశీ కరెన్సీ (కువైట్ దినార్, ఖతార్) తో పాటు 6.8 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ చట్టం 1962లోని నిబంధనల ప్రకారం స్మగ్లింగ్ చేసిన బంగారం క్యారియర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక న్యాయమూర్తి 13 రోజుల జ్యుడీషియల్ కస్టడీ కోసం నిందితుడికి రిమాండ్ విధించారు. స్మగ్లింగ్ బంగారం వెనుక సిండికేట్‌లను గుర్తించడం చాలా కష్టమైన పని అంటున్నారు అధికారులు. దేశంలోకి అక్రమంగా తరలించబడిన బంగారాన్ని తక్షణమే పాడు చేసి, విదేశీ గుర్తులను తొలగించి కరిగించేస్తారని తెలిపారు. ఇదంతా కూడా బంగారాన్ని అంతర్గత ప్రాంతాలకు తరలించడానికి ముందే చేస్తారని చెప్పారు. 2022-23, 2023-24 సంవత్సరాల్లో విజయవాడ కస్టమ్స్ (ప్రివెంటివ్) కమిషనరేట్ పరిధిలో సుమారు రూ.40 కోట్ల విలువైన 70 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో గోల్డ్ స్మగ్లింగ్ అనేది చాలాపెరిగిపోయింది. చాలామంది విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని చాలా విమానశ్రయాల్లో అక్రమ బంగారం తరిలిస్తూ దొరికిపోయిన ప్రయాణికులు ఉన్నారు. నిందితులు కస్టమ్స్ అధికారుల నుంచి తప్పించుకునేందుకు ఎన్ని ఎత్తుగడలు వేసిన చివరికి అధికారులకు పట్టుబడుతున్నారు. అయినా కూడా ఈ గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. చాలా అరుదుగా మాత్రమే కొంతమంది ప్రయాణికులు అధికారుల నుంచి తప్పించుకోగలుగుతున్నారు. ముఖ్యంగా దుబాయ్, సౌదీ అరేబియా, కువైట్, కత్తార్ లాంటి గల్ఫ్ దేశాల నుంచి వచ్చేవారు ఎక్కువగా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోతుంటారు. అధికారులు శిక్షలు వేసినప్పటికీ కూడా ఈ నేరాలు ఆగడం లేదు. డబ్బులు సంపాదించాలనే ఆశతో చాలామంది ఇలాంటి నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు.