Odisha Train Accident: ఇదెలా సాధ్యం..! ఒంటిపై ఎలాంటి గాయాలు లేకుండా 40 మంది మృతదేహాలు.. ఎలా చనిపోయారంటే..

|

Jun 07, 2023 | 11:32 AM

ఈ విషయం గమనించిన రెస్క్యూ టీం షాక్‌కు గురయ్యారు. వారంతా ఎలా మరణించారనే మరణం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు సంస్థలు సైతం ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాయి. బాధిత కుటుంబాలను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కాగా, ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల బృందం 24 గంటలు అప్రమత్తంగా ఉంది. చాలా మంది ప్రయాణికులను బస్సులో వారి ఇళ్లకు తరలించారు.

Odisha Train Accident: ఇదెలా సాధ్యం..! ఒంటిపై ఎలాంటి గాయాలు లేకుండా 40 మంది మృతదేహాలు.. ఎలా చనిపోయారంటే..
Odisha Train Accident
Follow us on

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం జాబితాలో చేరింది. ఈ ప్రమాదంలో 278 మంది మరణించగా, 1200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కానీ ప్రమాదం జరిగిన తర్వాత, రెస్క్యూ అండ్ రిలీఫ్ టీమ్ సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే శరీరంపై ఒక్క గాయం కూడా లేకుండా పడివున్న 40 మృతదేహాలను కనుగొన్నారు రెస్క్యూ టీం. ఈ విషయం గమనించిన రెస్క్యూ టీం షాక్‌కు గురయ్యారు. వారంతా ఎలా మరణించారనే మరణం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు సంస్థలు సైతం ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాయి. అయితే పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో దీనికి సమాధానం దొరికింది.

బాలాసోర్‌ రైలు ప్రమాదంలో విద్యుదాఘాతంతో 40 మంది మృతి చెందారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ నుండి స్వాధీనం చేసుకున్న సుమారు 40 మృతదేహాలు ఒక్క గాయం కూడా లేకుండా గుర్తించబడ్డారు. ఇది నిజంగా షాక్‌ అవ్వాల్సిన వాస్తవం. అయితే, వారంతా విద్యుదాఘాతంతో మరణించారని వైద్యులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) స్వయంగా తెలియజేసింది. బాలాసోర్‌లోని జిఆర్‌పి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ కూడా ప్రమాదం తర్వాత, ఓవర్‌హెడ్ వైర్లు తెగి కోచ్‌లపై పడి, వాటిలోని ప్రయాణీకులను విద్యుదాఘాతానికి గురైనట్టుగా సూచించింది. ఈ కారణంగానే వారు మరణించారని తెలిసింది. ఓవర్ హెడ్ వైర్లను తాకడం వల్ల ఎలాంటి గాయాలు కాలేదని, కరెంట్‌ షాక్‌ కారణంగానే చాలా మంది ప్రయాణికులు మరణించారని పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ పి కుమార్ నాయక్ ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు. ప్రమాదం అనంతరం కోచ్‌లు బోల్తా పడడంతో విద్యుత్ స్తంభాలు నేలకూలాయని, పై నుంచి వెళ్తున్న వైర్లు తెగి కోచ్‌లపై పడ్డాయని పోలీసు అధికారులు తెలిపారు.

ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం మూడు రైళ్లు పట్టాలు తప్పడంతో పెను విధ్వంసం సంభవించింది. ఈ సమయంలో హౌరా-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్, నిలబడి ఉన్న గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఈ ఘటనలో దోషులు ఎవరైనా సరే.. వారిని వదిలిపెట్టేది లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇప్పటికే చెప్పారు. బాధిత కుటుంబాలను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కాగా, ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల బృందం 24 గంటలు అప్రమత్తంగా ఉంది. చాలా మంది ప్రయాణికులను బస్సులో వారి ఇళ్లకు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..