Odisha: ఒడిశాలో దారుణం.. కిడ్నాప్ అయిన వ్యాపారి కొడుకు దారుణ హత్య.

|

Mar 30, 2023 | 2:19 PM

ఒడిశాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒడిశాలోని ఝార్సుగూడలో 15 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగులు దారుణంగా హతమార్చారు. ఝుర్సుగూడకు చెందిన ఓ వ్యాపారవేత్త కుమారుడిని కొందరు దుంగడగులు మార్చి 27వ తేదీన కిడ్నాప్‌ చేశారు...

Odisha: ఒడిశాలో దారుణం.. కిడ్నాప్ అయిన వ్యాపారి కొడుకు దారుణ హత్య.
Odisha
Follow us on

ఒడిశాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒడిశాలోని ఝార్సుగూడలో 15 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగులు దారుణంగా హతమార్చారు. ఝుర్సుగూడకు చెందిన ఓ వ్యాపారవేత్త కుమారుడిని కొందరు దుంగడగులు మార్చి 27వ తేదీన కిడ్నాప్‌ చేశారు. అనంతరం రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే అంతలోనే కిడ్నాప్‌ అయిన కుర్రాడు మార్చి 28వ తేదీన శవమై కనిపించడం కలకలం రేపింది. దుండగులు కుర్రాడిని అత్యంత దారుణంగా తల నరికేశారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. అమిత్ శర్మ, దినేష్ అగర్వాల్‌లు ఈ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. జార్సుగూడలో యువకుడిని కిడ్నాప్‌ చేసి, అనంతరం దారుణంగా చంపి, మృతదేహాన్ని తగలబెట్టినట్లు ఇద్దరు అంగీకరించినట్లు పోలీసులు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు దీనిపై విచారణ సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే రెండు నెలల కిత్రం ఒడిశా ఆరోగ్య మంత్రి నభాదాస్‌ కూడా కాల్పుల్లో మరణించారు. దీంతో రాష్ట్రంలో జరిగిన వరుస హత్యలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పందించారు. ఒడిశా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ విషయమై మంత్రి ధర్మేంద్ర ట్వీట్ చేస్తూ.. ‘ఒడిశాలో చట్టం ఎంతలా వైఫల్యం చెందిందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. అధికారంలో ఉన్నవారు రాష్ట్రంలో శాంతిభద్రతల లోపాలను ఇప్పటికైనా గుర్తించాలి. రాష్ట్ర మంత్రి నభా దాస్‌ను పట్టపగలు హత్య చేసి రెండు నెలలు కూడా గడవకముందే మరో యువకుడి దారుణ హత్య జరగడం.. ఒడిశాలో గాడి తప్పన పాలన తీరును బయటపెడుతోంది’ అని ట్వీట్ చేశారు. మరి ఈ వ్యవహారంపై ఒడిశా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..