NPR..UPDATE..ఏప్రిల్ 1 నుంచి.. ప్రథమ పౌరుడే ఫస్ట్ అయ్యాక

| Edited By: Pardhasaradhi Peri

Feb 17, 2020 | 3:23 PM

జాతీయ జనాభా గణన (ఎన్‌పీ‌ఆర్) అప్‌డేట్ ప్రక్రియను ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించనుంది. న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేరును ఈ మొట్టమొదట ఈ జాబితాలో చేర్చనున్నారు. ఆ తరువాత ప్రధాని మోదీ, అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్లను చేరుస్తారు. పాలసీ ప్రకారం రాష్ట్రపతితో ఈ ప్రక్రియ లాంచ్ అవుతుందని రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయాలు వెల్లడించాయి.  ఈ ముగ్గురి ఎన్యుమరేషన్ కోసం అధికారులు అదే రోజున వీరి […]

NPR..UPDATE..ఏప్రిల్ 1 నుంచి.. ప్రథమ పౌరుడే ఫస్ట్  అయ్యాక
Follow us on

జాతీయ జనాభా గణన (ఎన్‌పీ‌ఆర్) అప్‌డేట్ ప్రక్రియను ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించనుంది. న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేరును ఈ మొట్టమొదట ఈ జాబితాలో చేర్చనున్నారు. ఆ తరువాత ప్రధాని మోదీ, అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్లను చేరుస్తారు. పాలసీ ప్రకారం రాష్ట్రపతితో ఈ ప్రక్రియ లాంచ్ అవుతుందని రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయాలు వెల్లడించాయి.  ఈ ముగ్గురి ఎన్యుమరేషన్ కోసం అధికారులు అదే రోజున వీరి నివాసాలకు వెళ్తారని తెలిసింది. వీరు అదే ప్రాంతంలో ఉంటున్న విషయాన్ని ఈ కార్యాలయాలకు చెందిన వర్గాలు గుర్తు చేశాయి. హోం మంత్రి అమిత్ షా సమక్షంలో రాష్ట్రపతి ఎన్యుమరేషన్ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక కేబినెట్ మంత్రుల పేర్లను కూడా ఈ జాబితాలో చేర్చే అంశానికి విస్తృత ప్రచారం కల్పించనున్నారు. ఎన్‌పీ‌ఆర్‌పై ప్రతిపక్షాలు, విపక్ష పాలిత రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సంగతి విదితమే. ఈ ప్రక్రియ సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి పబ్లిక్ మెసేజ్ ఇవ్వవచ్చునని భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలకోసం ప్రజలంతా ఇందులో మనస్ఫూర్తిగా పాల్గొనాలని వారు కోరవచ్చు.

ఎన్‌పీ‌ఆర్ ను తాము అప్‌డేట్ చేసే ప్రసక్తే లేదని కేరళ ప్రకటించగా.. తాము వాయిదా వేస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ పేర్కొంది. పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఇందుకు విముఖంగా ఉన్నాయి. అటు-ఎన్‌పీ‌ఆర్ మాన్యువల్, డ్రాఫ్ట్ ఫామ్‌లను ఖరారు చేస్తున్నారని, ఫారాల ముద్రణ మార్చి రెండో వారం నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అయితే ఈ ఫారాలలో తలిదండ్రుల జన్మ స్థలం తదితర వివాదాస్పద అంశాలపై  వివరాలు ఇవ్వడానికి ప్రజల్లో చాలామంది అప్పుడే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్.. తనకు తన పేరెంట్స్ జన్మస్థలమేదో తెలియదని, అధికారులు తనను నిర్బంధ శిబిరానికి పంపితే తక్షణమే అందుకు సిధ్ధమని అప్పుడే ప్రకటించారు కూడా.