Kerala CM on Medical Bills: మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మోగడంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక ప్రకటన చేశారు. కోవిడ్ నివారణ చర్యలకు సహకరించని వారికి ఉచిత వైద్యం అందించబోమని కేరళ సీఎం పినరయి విజయన్ మంగళవారం తెలిపారు. “వ్యాక్సిన్ తీసుకోకుండానే కోవిడ్-19 పాజిటివ్‌గా మారిన వారి చికిత్స ఖర్చు ప్రభుత్వం భరించదు” అని విజయన్ తేల్చి చెప్పారు. కరోనా టీకాలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ.. ప్రభుత్వానికి సహకరించని వారికి ఉచిత వైద్యం నిలివేస్తామని సీఎం జయన్ స్పష్టం చేశారు. ఆరోగ్య పరిస్థితి లేదా ఎలర్జీ కారణంగా వ్యాక్సిన్ తీసుకోలేని వారు ఈ విషయాన్ని నిర్ధారించేలా ప్రభుత్వ వైద్యుల వద్ద ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొని ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇతరులు ఏడు రోజులకు ఒకసారి RT-PCR నెగటివ్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి. ఆర్‌టీపీసీఆర్ పరీక్షల నగదును అయా వ్యక్తులే భరించాలి’’ అని అన్నారు.
పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే వారికి, ప్రజలతో మమేకమయ్యే వారికి ఇది వర్తిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు అప్రమత్తం చేసినట్లు సీఎం పేర్కొన్నారు. ఇందులో భాగంగా విదేశాల నుంచి వచ్చే వారి ట్రావెల్ హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని ఆయన అన్నారు.
No more free treatment for those who do not cooperate with Covid prevention measures. Non vaccinated teachers and employees who work from offices or interact with public, will have to submit weekly results of RTPCR tests, paid for by themselves, to ensure safety of all.
— CMO Kerala (@CMOKerala) November 30, 2021
డిసెంబర్ 1 నుండి 15 వరకు కేరళలో మరోసారి ప్రత్యేక టీకా డ్రైవ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. పాఠశాల సమయాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, అలాగే వికలాంగ పిల్లలను పాఠశాలలకు రావడానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో కోవిడ్-19 సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి విజయన్ అధికారులకు కీలక సూచనలు చేశారు. కొత్త వేరియంట్ వల్ల కలిగే భయం కారణంగా మరిన్ని సడలింపులు ఇవ్వకూడదని నిర్ణయించారు.