తమిళనాడులోని ఉత్తరాదివాళ్ళు ఛీటర్లు ….వాళ్ళు ఏం చేస్తున్నారంటే ? అప్పుడే సంచలనం రేపుతున్న కొత్త మంత్రి వ్యాఖ్యలు

తమిళనాడులో ఉంటున్న ఉత్తరాదివారు డీఎంకే నుంచి ప్రయోజనాలు పొందుతూ బీజేపీకి ఓటు వేస్తున్నారని రాష్ట్ర కొత్త మంత్రి పి.కె.శేఖర్ బాబు అన్నారు. ఇలా వీరు ప్రభుత్వాన్ని ఛీట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు....

తమిళనాడులోని ఉత్తరాదివాళ్ళు  ఛీటర్లు ....వాళ్ళు ఏం చేస్తున్నారంటే ? అప్పుడే సంచలనం రేపుతున్న కొత్త మంత్రి వ్యాఖ్యలు
North Indians In Tamilnadu Getting Richer Due To Dmk Says Minister P.k.sekar Babu

Edited By: Anil kumar poka

Updated on: May 26, 2021 | 5:09 PM

తమిళనాడులో ఉంటున్న ఉత్తరాదివారు డీఎంకే నుంచి ప్రయోజనాలు పొందుతూ బీజేపీకి ఓటు వేస్తున్నారని రాష్ట్ర కొత్త మంత్రి పి.కె.శేఖర్ బాబు అన్నారు. ఇలా వీరు ప్రభుత్వాన్ని ఛీట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ రాష్ట్రంలో నివసిస్తున్న వీరు డీఎంకే పథకాల ద్వారా డబ్బు పోగేసుకుంటున్నారని, కానీ బీజేపీకి ఓటు వేస్తున్నారని ఆయన చెప్పారు. చెన్నైలో బుధవారం జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన.. వీరు ధనికులవుతున్నారని, అయితే బీజేపీ వల్ల కాదని అన్నారు. వీరు సొమ్ములు సంపాదిస్తున్నది డీఎంకే పార్టీ వల్లే అని చెబుతున్నా అని శేఖర్ బాబు వ్యాఖ్యానించారు. ఇదివరకైతే ఎన్నికలప్పుడు బ్యాలట్ పత్రాలు ఉండేవని, ఇప్పుడు ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వచ్చాయి గనుక బటన్ నొక్కితే ఎవరు ఎవరికీ ఓటు వేశారో తెలిసిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలోని ఉత్తరాదివారిని గిల్టీగా ఫీలయ్యేట్టు చూడాలని, సిగ్గు పడేలా చేయాలని ఆయన సూచించారు కూడా. తమ పొరబాట్లు తాము తెలుసుకునేలా చూడాలని శేఖర్ బాబు అన్నారు.

రాష్ట్రంలో చాలా చోట్ల ఉత్తరాదివారు నివసిస్తున్నారు. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్న ప్రజలు భారీ సంఖ్యలో ఉన్నారు. సహజంగానే వీరు ప్రధాని మోదీ ప్రభుత్వానికి జై కొడుతున్నారు. అయితే వివిధ కారణాలవల్ల పెద్ద సంఖ్యలో ఉత్తరాది రాష్ట్రాల వారు తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలకు తరలివస్తున్నారు. కాగా తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వంలో శేఖర్ బాబు హిందూ రెలిజియస్, చారిటబుల్ ఎండో మెంట్స్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన వ్యాఖ్యలు అప్పుడే వివాదాస్పదమవుతున్నాయి.

మరిన్ని చదవండి ఇక్కడ ఇక్కడ : గుంతలో పడిన గున్న ఏనుగు…రక్షించడానికి నానా తంటాలు… చివరకు…?? ( వీడియో )
Cyclone Yaas: అల్లకల్లోలం సృష్టిస్తున్న యాస్ తుఫాన్.. నివాస ప్రాంతాల్లోకి సముద్రం నీరు.. వీడియో..