AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Woman constable: లేడీ పోలీసునే బుట్టలో వేసుకున్న మహా ఘనుడు..భలే ట్రిక్‌ ప్లే చేశాడు..?

ఆమెది నోయిడాలో కానిస్టేబుల్‌ ఉద్యోగం... చేతినిండా జీతం.. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. అందుకోసం మ్యాట్రిమోనీలో తన వివరాలు పొందుపరిచింది.

Woman constable: లేడీ పోలీసునే బుట్టలో వేసుకున్న మహా ఘనుడు..భలే ట్రిక్‌ ప్లే చేశాడు..?
Woman Constable
Jyothi Gadda
|

Updated on: May 21, 2022 | 7:59 PM

Share

ఆమెది నోయిడాలో కానిస్టేబుల్‌ ఉద్యోగం… చేతినిండా జీతం.. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. అందుకోసం మ్యాట్రిమోనీలో తన వివరాలు పొందుపరిచింది. అందులో ఓ యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. అభిరుచులు కలవడంతో… అతనిని పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. అయితే… పెళ్లి పేరుతో ఆమెను ఆ వ్యక్తి మోసం చేశాడు. మాయ మాటలు చెప్పి… ఆమె వద్ద నుంచి రూ.లక్షల్లో డబ్బులు గుంజేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌ గౌతమ్‌బుద్ధనగర్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు పరిశీలించగా…

ఉత్తర ప్రదేశ్ గౌతమ్‌బుద్ధ నగర్‌ జిల్లా నోయిడాకు చెందిన ఓ లేడీ కానిస్టేబుల్‌ ఓ కేటుగాడిని నమ్మి నిలువు దోపిడీకి గురైంది. అస్సాం రైఫిల్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సదరు మహిళ భర్త 2021లో గుండెపోటుతో మరణించినట్టు తెలిసింది. ఆ తర్వాత ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలంటూ ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. దాంతో ఆమె గత సెప్టెంబర్ 2021లో మ్యాట్రిమోనియల్ సైట్‌లో తన ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేసింది. తగిన మ్యాచ్ కుదిరితే పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇదే అదునుగా భావించిన కేటుగాడు. ఆమె ఫ్రోఫైల్‌కు రిప్లై ఇచ్చాడు. ఆమె పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కెనడాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ సంజయ్ సింగ్ అనే వ్యక్తి. తాను ఢిల్లీలోని ఓ టెలికాం కంపెనీలో పనిచేస్తున్నానని, తన తల్లి కెనడాలో ఉంటోందని మహిళకు నమ్మబలికాడు.

అలా, మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా కానిస్టేబుల్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు స్నేహితులుగా మారారు. ఇక ఆ తరువాతే అతగాడి అసలు సంగతి బయటపడింది…తరచూ ఏదో ఒక సాకుతో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా డబ్బు పంపాలని ఆ మహిళా కానిస్టేబుల్‌ కోరాడు. ఈ క్రమంలోనే తన మేనల్లుడికి యాక్సిడెంట్ అయ్యిందని తన ఏటీమ్ లను కంపెనీ బ్లాక్ చేసిందని చెప్పాడు. దీంతో మహిళ 2 లక్షలు ఇచ్చింది. కొన్ని రోజుల పాటు అలాగే మాయ మాటలు చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత.. తన లావాదేవీలను కంపెనీ బ్లాక్ చేసిందని, డబ్బు విత్‌డ్రా చేయలేనని చెప్పాడు. అలా .. విడుతల వారిగా.. 60 లక్షల వరకు వసూల్ చేశాడు. కొద్ది రోజుల తర్వాత ఆమె తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగ్గా, తాను న్యూయార్క్‌లో ఇరుక్కుపోయానని చెప్పాడు. ఇక ఆ తర్వాత సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.