Amartya Sen – Corona: నోబెల్ అవార్డ్ గ్రహీత ఆర్థికవేత్త అమర్త్యసేన్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్యుల సంరక్షణలో శాంతినికేతన్‌లోని తన నివాసంలోనే క్వారంటైన్ అయ్యారు. అక్కడే ఆయన చికిత్స పొందుతున్నారు. జులై 1న శాంతినికేతన్‌లోని తన నివాసానికి వచ్చిన ఆయనకు.. కొద్ది రోజులు ఆరోగ్యం బాగుండటం లేదు. దాంతో ఆయన వైద్య పరీక్షలతో పాటు కరోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. దాంతో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.