సుశాంత్ కేసులో సీబీఐ నుంచి తమకు ఇంతవరకు ఎలాంటి సమన్లు అందలేదని రియాచక్రవర్తి తరఫు లాయర్ తెలిపారు. తాము చట్టానికి అనుగుణంగా నడుచుకుంటామని, ఆ దర్యాప్తు సంస్థ ఎప్పుడు పిలిచినా హాజరవుతామని ఆయన చెప్పారు. లోగడ కూడా రియా, ఆమె కుటుంబ సభ్యులు ముంబై పోలీసుల ఎదుట, ఈడీ ముందు హాజరైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో ఊహాగానాలు అనవసరమన్నారు. మరోవైపు-సీబీఐ వర్గాలు కూడా తాము రియాకు గానీ, ఆమె తండ్రికి గానీ సమన్లు పంపలేదని స్పష్టం చేశాయి.