Kerala’s ex-health minister KK Shailaja: కేరళ కొత్త కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేకే శైలజా టీచర్ స్పందించారు. నూతన కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై తనకెలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. ‘‘నూతన కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై ఎలాంటి అసంతృప్తి లేదు.. అది విధానపరమైన నిర్ణయమంటూ పేర్కొన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని.. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ భావోద్వేగ పోస్టులంటూ శైలజ పేర్కొన్నారు. దీనిలో ఎమోషన్ అవ్వాల్సిన అవసరం లేదంటూ స్పష్టంచేశారు. నూతన బాధ్యతలు తీసుకునే వారెవరైనా కొత్త వారేనని, కొత్త వారికి కూడా ఓ అవకాశం ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు. తమ పార్టీలో చాలా మంది సమర్థులున్నారని, వారికీ ఓ అవకాశమిస్తే వారూ ఇంకా సమర్థవంతంగా పనిచేస్తారంటూ ఆమె పేర్కొన్నారు.
అయితే.. కేవలం తనను మాత్రమే ఆపలేదని, చాలా మంది మంత్రులను కూడా కేబినెట్‌లో తీసుకోవడం లేదని శైలజ తెలిపారు. ఇప్పటి వరకూ చేసిన పనిపై చాలా సంతృప్తితోనే ఉన్నానని.. చాలా సిన్సియర్‌గా పనిచేశానని తెలిపారు. ఐదేళ్లల్లో కేబినెట్ సహచరులతో కలిసి చాలా కష్టపడి పనిచేశానని.. ఎన్నో అనుభవాలున్నాయని తెలిపారు. కరోనా, తదితర పరిస్థితుల్లో చాలా ఛాలెంజ్‌లను కూడా ఎదుర్కొన్నానని.. టీమ్ వర్క్‌గా పనిచేశానని తెలిపారు. తన పనిపై పూర్తి సంతృప్తితోనే ఉన్నానని.. ఈ ఐదేళ్లలో ఎంతో నేర్చుకున్నానంటూ శైలజ ప్రకటించారు. 64 ఏళ్ల శైలజా టీచర్ సీపీఎం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే కొత్త కేబినెట్‌లో శైలజా టీచర్ లేకపోవడంపై సోషల్ మీడియాలో పలువురు విజయన్ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తంచేస్తున్నారు. దీనిపై ఆమె ఈ విధంగా స్పందించారు.
Also Read: