ఎన్ఎంసీ బిల్లు : ఆందోళన విరమించిన ఎయిమ్స్ వైద్యులు

| Edited By:

Aug 05, 2019 | 7:22 AM

ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా నాలుగు రోజులుగా ఆందోళన చేపట్టిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు.. ఎట్టకేలకు తమ నిరసనను విరమించారు. డాక్టర్లతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ జరిపిన చర్చలు ఫలించాయి. ఎన్ఎంసీ బిల్లుపై వారు లేవనెత్తిన పలు అంశాలు, అనుమానాలను మంత్రి నివృత్తి చేశారు. దీంతో ఆందోళన విరమించేందుకు వైద్యులు అంగీకరించారు. నేటి నుంచి విధులకు హాజరవుతున్నట్లు ప్రకటించారు. అంతకుముందు ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు కూడా […]

ఎన్ఎంసీ బిల్లు : ఆందోళన విరమించిన ఎయిమ్స్ వైద్యులు
Follow us on

ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా నాలుగు రోజులుగా ఆందోళన చేపట్టిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు.. ఎట్టకేలకు తమ నిరసనను విరమించారు. డాక్టర్లతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ జరిపిన చర్చలు ఫలించాయి. ఎన్ఎంసీ బిల్లుపై వారు లేవనెత్తిన పలు అంశాలు, అనుమానాలను మంత్రి నివృత్తి చేశారు. దీంతో ఆందోళన విరమించేందుకు వైద్యులు అంగీకరించారు. నేటి నుంచి విధులకు హాజరవుతున్నట్లు ప్రకటించారు. అంతకుముందు ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు కూడా ఆందోళన చేపట్టారు.