బీహార్ ఎన్నికల్లో నితీష్, బీజేపీ సీట్ల సర్దుబాటు ఖరారు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ-యు,... బీజేపీ సీట్ల పంపిణీపై ఓ అవగాహనకు వచ్చాయి. ఈ ఒప్పందం కింద మొత్తం 243 స్థానాలకు గాను జేడీ-యు 122 సీట్లకు..

బీహార్ ఎన్నికల్లో నితీష్, బీజేపీ సీట్ల సర్దుబాటు ఖరారు

Edited By:

Updated on: Oct 04, 2020 | 10:30 AM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ-యు,… బీజేపీ సీట్ల పంపిణీపై ఓ అవగాహనకు వచ్చాయి. ఈ ఒప్పందం కింద మొత్తం 243 స్థానాలకు గాను జేడీ-యు 122 సీట్లకు, బీజేపీ 121 స్థానాలకు పోటీ చేయనున్నాయి. అంటే 50 : 50 ఫార్ములాను ఇవి అనుసరించాయి. జితన్ రామ్ మంఝి ఆధ్వర్యంలోని హిందుస్తానీ అవామీ మోర్ఛాకు జేడీ-యు కొన్ని సీట్లను కేటాయించనుంది. అలాగే రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి బీజేపీ కొన్ని స్థానాలను ఇవ్వనుంది. అయితే తమకూటమితో చేతులు కలిపితేనే అని షరతు విధించింది.ఈ నెల 28 నుంచి మూడు దశల్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి.