Bihar Politics: బీహార్‌లో మహాకూటమి సర్కార్‌.. సీఎంగా నితీష్‌, డిప్యూటీ సీఎంగా తేజస్వీ.. ఇవాళే ప్రమాణం..

|

Aug 10, 2022 | 6:59 AM

ఏడుపార్టీల కూటమితో నితీష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా తేజస్వియాదవ్‌ సైతం బాధ్యతలు తీసుకోనున్నారు.c

Bihar Politics: బీహార్‌లో మహాకూటమి సర్కార్‌.. సీఎంగా నితీష్‌, డిప్యూటీ సీఎంగా తేజస్వీ.. ఇవాళే ప్రమాణం..
Nitish Kumar Tejaswi Yadav
Follow us on

Bihar Politics: బీహార్‌లో మహాకూటమి సర్కార్‌ ఏర్పాటుకు రంగం సిద్దమయ్యింది. బీహార్‌ సీఎంగా నితీష్ కుమార్‌ ఇవాళ మరోసారి ప్రమాణం చేయబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు చేశారు. ఏడుపార్టీల కూటమితో నితీష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా తేజస్వియాదవ్‌ సైతం బాధ్యతలు తీసుకోనున్నారు. కాంగ్రెస్‌కు స్పీకర్‌ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంతకాలం ఎన్డీఏతో జతకట్టిన నితీష్‌ గుడ్‌బై చెప్పారు. నిన్న సీఎంగా రాజీనామా చేసిన నితీష్.. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమితో జతకడుతున్నట్లు తెలిపారు. బీజేపీ తనను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. రబ్రీదేవి నివాసంలో జరిగిన భేటీలో నితీష్‌ను మహాకూటమి నేతగా ఎన్నుకున్నారు. నితీష్‌కు మద్దతుగా తేజస్వియాదవ్‌ గవర్నర్‌కు లేఖ ఇచ్చారు. 2017లో ఏం జరిగిందో అన్ని మర్చిపోయి బీహార్‌ అభివృద్దికి పాటుపడుతామని ఇద్దరు నేతలన్నారు. తమకు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు నితీష్‌. ఏడు పార్టీల మహా కూటమితో సర్కార్‌ ఏర్పాటు కాబోతోంది.

బీజేపీ తీరుపై నితీష్‌ విమర్శలు

బీజేపీ తీరుపై నితీష్‌ విరుచుకుపడ్డారు. తనను బలహీనం చేసేందుకు బీజేపీ చాలా కుట్రలు చేసిందని ఆరోపించారు. చాలాసార్లు బీజేపీ తనను అవమానించిందన్నారు నితీష్‌. జేడీయూ ఎంపీలు , ఎమ్మెల్యేల అభీష్టం మేరకే ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకు వచ్చినట్టు తెలిపారు. మంగళవారం జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం తరువాత ఎన్‌డీఏకు గుడ్‌బై చెప్పాలని మా నిర్ణయం తీసుకున్నారు నితీష్‌కుమార్‌. బీజేపీతో ఎందుకు తెగదెంపులు చేసుకోవాల్సి వచ్చిందో అసలు కారణాన్ని బయటపెట్టారు.

కాగా.. నితీష్‌ ఆరోపణలకు బీజేపీ కౌంటరిచ్చింది. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం తోనే బీహార్‌లో నితీష్‌ సీఎం అయ్యారని రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. కేవలం 43 సీట్లే వచ్చినప్పటికి మోదీ ఆయన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించారని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం