‘సారీ ! చాలాసేపు మాట్లాడా ! కానీ తప్పదు !’ నిర్మల

| Edited By: Anil kumar poka

Feb 09, 2020 | 5:07 PM

పార్లమెంటులో బడ్జెట్ సమర్పించిన సందర్భంగా తాను చాలాసేపు మాట్లాడవలసివచ్చిందని, ఇందుకు క్షమించాలని కోరారు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్. అయితే ఇది తప్పనిసరి అయిందన్నారు.  దేశ ఆర్థికవ్యవస్థకు సంబంధించి ప్రతి అంశాన్నీ ప్రస్తావించవలసిన అవసరం ఏర్పడిందని అన్నారు. ‘ సారీ ! మీ అందరికీ ఇబ్బంది కలిగించాను. ఈ మహిళ ఇంతసేపు.. దాదాపు రెండున్నర గంటలపాటు ఎలా మాట్లాడిందా అని మీరంతా భావించవచ్చు. కానీ మాకంటూ ఓ డ్యూటీ ఉంది. దాన్ని అమలు చేయాల్సిందే’ అన్నారామె. చెన్నైలో […]

సారీ ! చాలాసేపు మాట్లాడా ! కానీ తప్పదు ! నిర్మల
Follow us on

పార్లమెంటులో బడ్జెట్ సమర్పించిన సందర్భంగా తాను చాలాసేపు మాట్లాడవలసివచ్చిందని, ఇందుకు క్షమించాలని కోరారు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్. అయితే ఇది తప్పనిసరి అయిందన్నారు.  దేశ ఆర్థికవ్యవస్థకు సంబంధించి ప్రతి అంశాన్నీ ప్రస్తావించవలసిన అవసరం ఏర్పడిందని అన్నారు. ‘ సారీ ! మీ అందరికీ ఇబ్బంది కలిగించాను. ఈ మహిళ ఇంతసేపు.. దాదాపు రెండున్నర గంటలపాటు ఎలా మాట్లాడిందా అని మీరంతా భావించవచ్చు. కానీ మాకంటూ ఓ డ్యూటీ ఉంది. దాన్ని అమలు చేయాల్సిందే’ అన్నారామె. చెన్నైలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సుదీర్ఘ సమయం ప్రసంగించాల్సిన అవసరం తనకెంతయినా కలిగిందని, కాస్త సేద దీరి.. మంచినీళ్లు తాగి మిగతా భాగాన్ని పూర్తి చేయవలసివచ్చిందని ఆమె చెప్పారు. ఈ నెల 1 న పార్లమెంటులో నిర్మల సుమారు 160 నిముషాలు ప్రసంగించిన సంగతి తెలిసిందే. బడ్జెట్ ప్రతుల్లో ఇంకా రెండు పేజీలు మిగిలి ఉండగానే  స్వల్ప అస్వస్ధత కారణంగా ఆమె మధ్యలోనే స్పీచ్ ఆపేసి నిష్క్రమించారు.