AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హథ్రస్‌ కేసు వాదించబోతున్న సీమా కుష్వాహా

సీమా కుష్వాహా.... నిర్భయ కేసులో అలుపెరుగని పోరాటం చేసిన న్యాయవాది.. నిర్భయ ఘటనలో బెదిరింపులకు భయపడకుండా.. అడ్డంకులను అధిగమిస్తూ న్యాయాన్ని గెలిపించిన లాయర్‌!

హథ్రస్‌ కేసు వాదించబోతున్న సీమా కుష్వాహా
Balu
|

Updated on: Oct 02, 2020 | 1:08 PM

Share

సీమా కుష్వాహా…. నిర్భయ కేసులో అలుపెరుగని పోరాటం చేసిన న్యాయవాది.. నిర్భయ ఘటనలో బెదిరింపులకు భయపడకుండా.. అడ్డంకులను అధిగమిస్తూ న్యాయాన్ని గెలిపించిన లాయర్‌! ఇప్పుడామె హథ్రస్‌ బాధితురాలికి కేసును కూడా వాదించాలనుకుంటున్నారు.. ఇందుకోసం ఆమె నిన్న బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు ప్రయత్నించారు.. అయితే ఉత్తరప్రదేశ్‌ పోలీసులు సీమాను దారిలోనే అడ్డుకున్నారు.. బాధితురాలి కుటుంబసభ్యుల విన్నపం మేరకే తాను వచ్చానని, అధికారయంత్రాంగం మాత్రం అవరోధాలు కల్పిస్తున్నదని సీమా కుష్వాహా ఆవేదనతో అన్నారు.. కుటుంబాన్ని కలిసిన తర్వాతే తాను వెనక్కి వెళతానని గట్టిగా చెప్పారు. బాధితురాలి అన్నతో తాను సంప్రదింపులు జరుపుతున్నానని, ఈ కేసును తప్పకుండా టేకప్‌ చేస్తానని, నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చూస్తానని ఆమె తెలిపారు. నిర్భయ ఘటన మన స్మృతిపథంలో ఇంకా మెదులుతూనే ఉంది. డిసెంబర్‌ 16, 2012న ఢిల్లీలో జరిగిన ఆ ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిచింది.. అప్పుడు బాధితురాలి తరఫున వాదించి, కేసును గెలిపించింది సీమానే! నిర్భయకు జరిగిన అన్యాయమే ఇప్పుడు హథ్రస్‌లో 19 ఏళ్ల దళిత యువతికి జరిగింది.. ఆ అమ్మాయిపై అగ్రకులానికి చెందిన నలుగురు అత్యాచారినికి పాల్పడి ఆమెను దారుణంగా హింసించారు.. తీవ్ర గాయాలతో ఆమె ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెబుతున్న అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ప్రశాంత్‌కుమార్‌ … ఆ అమ్మాయిపై అత్యాచారం జరిగినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో లేదని పేర్కొనడం గమనార్హం..

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా