బ్రేకింగ్: నిర్భయ కేసులో కీలక పరిణామం

| Edited By:

Jan 01, 2020 | 9:26 PM

నిర్భయ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నలుగురు దోషులను అధికారులు ఒకేసారి ఉరితీయనున్నారు. ఈ నేపథ్యంలో తీహార్ జైలులో నాలుగు ఉరికంబాలు, నాలుగు సొరంగాలను అధికారులు ఏర్పాటు చేశారు. పవన్, ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌లకు ఒకేసారి ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉంది. ఈ నెల 7న నలుగురు దోషుల డెత్ వారెంట్‌లపై ఢిల్లీ పటియాల హౌస్ కోర్టు తీర్పు వెల్లడించనుండగా .. ఆ వెంటనే వారికి ఉరి శిక్ష అమలు చేసే అవకాశాలు […]

బ్రేకింగ్: నిర్భయ కేసులో కీలక పరిణామం
Follow us on

నిర్భయ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నలుగురు దోషులను అధికారులు ఒకేసారి ఉరితీయనున్నారు. ఈ నేపథ్యంలో తీహార్ జైలులో నాలుగు ఉరికంబాలు, నాలుగు సొరంగాలను అధికారులు ఏర్పాటు చేశారు. పవన్, ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌లకు ఒకేసారి ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉంది. ఈ నెల 7న నలుగురు దోషుల డెత్ వారెంట్‌లపై ఢిల్లీ పటియాల హౌస్ కోర్టు తీర్పు వెల్లడించనుండగా .. ఆ వెంటనే వారికి ఉరి శిక్ష అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.  కాగా మైనర్లు  గీతా, సంజయ్ చోప్రా కిడ్నాప్ కేసులో దోషులైన బిల్లా-రంగాలను 1982లో ఒకేసారి ఉరి తీశారు. ఇక ఆ తరువాత ఈ నలుగురిని ఇలా ఒకేసారి ఉరి తీయబోతుండటం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. అయితే వీరి ఉరిపై అధికారిక ప్రకటన రానప్పటికీ.. వీరి ఉరిశిక్ష ఏర్పాట్లు సంబంధించిన వివరాలను జాతీయ మీడియా తెలిపింది.