Nirbhaya Case Updates: నిర్భయ కేసు.. కేంద్రం పిటిషన్ పై మళ్ళీ సుప్రీం విచారణ..

నిర్భయ కేసు దోషులు నలుగురిని వేర్వేరుగా ఉరి తీయాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. న్యాయమూర్తులు ఆర్.భానుమతి, అశోక్ భూషణ్, నవీన్ సిన్హాలతో

Nirbhaya Case Updates: నిర్భయ కేసు.. కేంద్రం పిటిషన్ పై  మళ్ళీ సుప్రీం విచారణ..

Edited By:

Updated on: Feb 25, 2020 | 12:55 PM

Nirbhaya Case Updates:నిర్భయ కేసు దోషులు నలుగురిని వేర్వేరుగా ఉరి తీయాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. న్యాయమూర్తులు ఆర్.భానుమతి, అశోక్ భూషణ్, నవీన్ సిన్హాలతో కూడిన బెంచ్ ఈ పిటిషన్ ను విచారిస్తుంది. ఈ కేసులో  దోషులందరినీ ఒకేసారి ఉరి తీయాలని ఢిల్లీ హైకోర్టు గత ఫిబ్రవరి 5 న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరిని వేర్వేరుగా ఉరి తీయాలన్న కేంద్ర పిటిషన్ ను కొట్టివేసింది. పైగా దోషులకు డెత్ వారెంట్లు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. కేంద్రం మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కాగా-ఒక దోషి మెర్సీ పిటిషన్ పెండింగులో ఉండగా.. ఇతర దోషులను ఉరి తీయరాదని జైలు నిబంధనలు చెబుతున్నాయని హైకోర్టు గతంలో అభిప్రాయపడింది. ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ దోషులందరి విషయంలో కామన్ ఆర్డర్, కామన్  జడ్జ్ మెంట్  వఛ్చిన అంశాన్ని ఈ కోర్టు గుర్తు చేసింది.

నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ దాఖలు చేసిన దరఖాస్తును శనివారం ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. తన క్లయింటు తలకు, కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయని, మానసిక ఆందోళనతో బాధ పడుతున్న అతనికి  వైద్య చికిత్స అవసరమని, ఇందుకు అనుమతించాలని కోరుతూ అతని తరఫు న్యాయవాది వేసిన పిటిషన్ ని కోర్టు డిస్మిస్ చేసింది. అటు-వినయ్ తో బాటు అక్షయ్, పవన్, ముకేశ్ సింగ్ లకు ఫ్రెష్ డెత్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ నలుగురిని మార్చి 3 వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాల్సి ఉంది.