తీహార్ జైలుకు తలారీ.. దోషులకు ఉరి పడబోతుందా?.. అసలు రేపు ఏం జరగబోతోంది..?

| Edited By:

Jan 31, 2020 | 7:47 AM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార కేసులో.. దోషులకు పడ్డ ఉరి శిక్ష అమలుపై.. ఇంకా సస్పెన్స్ నెలకొంది. ఓ వైపు ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6.00 గంటలకు ఉరిశిక్ష విధించాలని కోర్టు ఆదేశాలున్నా.. మరోవైపు దోషులు మాత్రం.. శిక్షనుంచి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు రేపు ఉరిశిక్ష అమలు పరిచేందుకు జైలు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. శిక్షను అమలుపరచేందుకు తలారీ పవన్‌ జల్లాద్.. గురువారమే తీహార్ జైలుకు […]

తీహార్ జైలుకు తలారీ.. దోషులకు ఉరి పడబోతుందా?.. అసలు రేపు ఏం జరగబోతోంది..?
Follow us on

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార కేసులో.. దోషులకు పడ్డ ఉరి శిక్ష అమలుపై.. ఇంకా సస్పెన్స్ నెలకొంది. ఓ వైపు ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6.00 గంటలకు ఉరిశిక్ష విధించాలని కోర్టు ఆదేశాలున్నా.. మరోవైపు దోషులు మాత్రం.. శిక్షనుంచి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు రేపు ఉరిశిక్ష అమలు పరిచేందుకు జైలు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. శిక్షను అమలుపరచేందుకు తలారీ పవన్‌ జల్లాద్.. గురువారమే తీహార్ జైలుకు చేరుకున్నట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఈయన మీరట్‌కు చెందిన వాడు. అయితే ఉరిశిక్ష అమలు చేసే నేపథ్యంలో.. ఆయన్ను గురువారం రప్పించారు.

జైలు ప్రాంగణంలోనే.. ఆయన కోసం ప్రత్యేక రూం, వసతి ఏర్పాట్లు చేశామన్నారు. మూడో తరానికి చెందిన తలారి పవన్‌ జల్లాద్.. తీహార్ జైలు ప్రాంగణంలోనే ఉంటూ.. దోషులకు వేసే ఉరితాడు సామర్థ్యంతోపాటు.. ఇతర విషయాలను కూడా పరిశీలిస్తారన్నారు. అంతేకాదు.. ఇవాళ డమ్మీ ఉరిని కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు..

ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల ముందే నిర్భయ దోషులు నలుగురికి ఒకేసారి ఉరి వేసేందుకు జైలు అధికారులు ట్రయల్స్‌ కూడా నిర్వహించారు. ఇందుకోసం బక్సర్ నుంచి ప్రత్యేక తాళ్లను తెప్పించారు. జైలు ప్రాంగణంలోని మూడో నంబర్‌ గదిలో నలుగురిని ఒకేసారి ఉరితీయనున్నారు.

అయితే మరికొద్ది గంటలు మాత్రమే మిగిలిఉన్నా.. దోషులు మాత్రం శిక్ష నుంచి తప్పించుకునేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నిర్భయ దోషి అక్షయ్‌ కుమార్‌ వేసుకున్న క్యురేటివ్‌ పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించింది. అంతేకాదు.. ఫిబ్రవరి 1వ తేదీన అమలుకానున్న ఉరిశిక్షపై స్టే విధించాలంటూ మరో పిటిషన్ కూడా వేశాడు. అయితే దానిని కూడా సుప్రీం తోసిపుచ్చింది. ఇక మరో దోషి వినయ్‌ శర్మ రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. మరి దీనిపై ఏం జరుగుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.