Nirav Modi: లండన్ వీధుల్లో తిరిగిన నీరవ్ మోడీ, ఇక ఇండియాకు రాక తప్పదు, త్వరలో అప్పగింతకు సన్నాహాలు

| Edited By: Pardhasaradhi Peri

Feb 25, 2021 | 7:33 PM

పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్లమేర మోసగించి పరారైన నీరవ్ మోడీని తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరుతూ ఇండియా చేసిన కృషి ఫలించింది

Nirav Modi: లండన్ వీధుల్లో తిరిగిన నీరవ్ మోడీ, ఇక ఇండియాకు రాక తప్పదు, త్వరలో అప్పగింతకు సన్నాహాలు
Follow us on

పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్లమేర మోసగించి పరారైన నీరవ్ మోడీని తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరుతూ ఇండియా చేసిన కృషి ఫలించింది. ఇతడిని భారత్ కు అప్పగించాలని లండన్ (వెస్ట్ మినిష్టర్) కోర్టు గురువారం ఆదేశించింది. రెండేళ్ల  పాటు ఈ కేసు అక్కడి కోర్టులో కొనసాగుతూ వచ్చింది. ఏదో సాకు చెబుతూ నీరవ్ మోడీ ఇండియాకు వెళ్లేందుకు నిరాకరిస్తూ వచ్చాడు.తమ  పీ ఎన్ బీ కి మొత్తం సుమారు 28 వేల కోట్ల ఫ్రాడ్ కు ఇతడే సూత్రధారి అంటూ ఆ బ్యాంకు యాజమాన్యం ఇతనితో బాటు ఇతని బన్ధవు మెహుల్ చొక్సీ పైన, మరికొందరిపైనా 2018 జనవరి 29 న కేసు పెట్టింది. ఫిబ్రవరి 5 నుంచి సీబీఐ ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించింది. అదే నెల 16 న ఈడీ నీరవ్ మోడీ ఇల్లు,కార్యాలయంపై దాడి చేసి 5,674 కోట్ల విలువైన వజ్రాలు, ఇతర జువెల్లరీని స్వాధీనం చేసుకుంది. 2018 లో జూన్ 2 న ఇంటర్ పోల్ ఇతనిపై మనీ లాండరింగ్ కేసు దాఖలు చేసింది. ఇతడిపై జూన్ 25 న ఈడీ, ముంబై స్పెషల్ కోర్టులో కేసు దాఖలు చేసింది. అదే ఏడాది ఆగస్టు 3 న భారత ప్రభుత్వం బ్రిటిష్ సర్కార్ ఎంబ్లమ్ కొమ్మా దరఖాస్తు పెట్టింది. మొత్తానికి నీరవ్ మోడీ లండన్ లో ఉన్నట్టు నిర్ధారణ అయింది. దాంతో అతడి ఆచూకీ కనుగొనాలని అధిఅక్రూలు మాంచెస్టర్ ఇంటర్ పోల్ ను కోరారు.

అదే ఏడాది డిసెంబరు 27 న తమ దేశంలోనే నీరవ్ మోడీ ఉన్నట్టు లండన్ కోర్టు భారత ప్రభుత్వానికి తెలిపింది. యితడు లండన్ వీధుల్లో తిరుగుతున్న ఫోటోను టెలిగ్రాఫ్ డైలీ 2019 మార్చి 9 న ప్రచురించింది. నీరవ్ పై కోర్టు ఫాల్ వారంట్ నుజారీ చేయగా 2019 మార్చి 20న పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని బెయిల్ అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది.  మెజెస్టి లోని జైలుకు తరలించారు. తను సరెండర్ అవుతానన్న నీరవ్ విజ్ఞప్తిని కూడా కోర్టు నమ్మలేదు. అతని రెండో బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించింది. ఇలా మొత్తం 5 సార్లు ఇతని బెయిల్ పిటిషన్ ని కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది. గత ఏదై మే 13 న భారత ప్రభుత్వం ఇతనిపై కొత్త ఆధారాలను కోర్టుకు సమర్పించింది. గత సంవత్సరం సెప్టెంబరు 7 న కోర్టు న్యాయమూర్తి ఆన్ లైన్ ద్వారా ముంబైలోని సర్ ఆర్థర్ రోడ్ జైలును చూశారు. 2021 లో ఇతని కేసును ఫైనల్ గా విచారిస్తామని లండన్ కోర్టు తెలిపింది. చివరకు 2021 ఫిబ్రవరి 25 న ఇతడిని భారత్ కు అప్పగించాలని కోర్టు ఆదేశించింది.

Also Read:

Farm Laws: వ్యవసాయ చట్టాల అమలు అప్పటివరకు సాధ్యం కాదు.. రైతులతో చర్చలకు రెడీగానే ఉన్నాం.. కేంద్ర మంత్రి తోమర్

ఈ చిన్న సూచనలు పాటించండి.. మోసగాళ్ల నుంచి సేవ్ అవ్వండి..