Omicron- Night Curfew: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత దేశంలో అడుగు పెట్టడమే కాదు.. రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తుండగా.. మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.. ఒమిక్రాన్ కట్టడి కోసం కఠిన నిబంధనలను అమలు చేయడానికి రెడీ అయ్యాయి. తాగా ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్, ఒడిశా ప్రభుత్వాలు ఒమిక్రాన్ కట్టడికోసం కొన్ని నియమనిబంధనలు ప్రకటించాయి. అవి రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి అమలు కానున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్:
యూపీలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూను కానున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శనివారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకు నైట్ కర్ఫ్యూ అమలు కానున్నది. అంతేకాదు, శుభకార్యాలకు, పెళ్లిళ్లు, వేడుకలకు హాజరయ్యే వారి సంఖ్యను కూడా పరిమితం చేసింది. కేవలం 200 మంది మాత్రమీ అనుమతినిస్తూ యోగి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎటువంటి ఫంక్షన్లు జరిపినా తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని పేర్కొంది.
మహారాష్ట్ర:
ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నిబంధనలను అమలు చేస్తూ.. కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. నేటి రాత్రి నుంచి ఇక్కడ కూడా కర్ఫ్యూ అమల్లోకి రానున్నది. శనివారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూని విధించింది. అంతేకాదు ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని ఆంక్షలు పెట్టింది. వివాహ వేడుకల్లో కేవలం 100మందికి మాత్రమే అనుమతినిచ్చింది. ఇక 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు, హోటళ్లు, జిమ్‌లకు అనుమతించింది.
గుజరాత్:
గుజరాత్‌లో కొన్ని ప్రాంతాల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్, భావ్‌నగర్, జామ్‌నగర్, గాంధీనగర్, జునాగఢ్‌ల్లో ఈరోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది.
ఒడిశా :
ఒడిశా ప్రభుత్వం ఒమిక్రాన్ కట్టడి కోసం నేటి నుంచి పలు ఆంక్షలను విధించింది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈరోజు నుంచి జనవరి 2 వ తేదీ వరకూ ఆంక్షలు అమలు కానున్నాయి. క్రిస్మస్ వేడుకల్లో కరోనా నిబంధనలను పాటించాలని.. 50 మంది కన్నా ఎక్కువమంది హాజరుకావొద్దని స్ఫష్టం చేసింది. అంతేకాదు న్యూ ఇయర్ వేడుకలను కూడా హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్లు, పార్కులు, కన్వెన్షన్ హాళల్లో నిర్వహించడానికి అనుమతి లేదని ప్రభుతం స్పష్టం చేసింది.
హరియాణా:
ఇక ఈశాన్య రాష్ట్రమైన హరియాణాలో శుక్రవారం రాత్రి నుంచే రాత్రి కర్ఫ్యూ అమలోకి వచ్చింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ ని విధించింది అక్కడ ప్రభుత్వం. పెళ్లిళ్లు, బహిరంగ కార్యక్రమాలకు 200 మంది మాత్రమే హాజరుకావాలని స్పష్టం చేసింది. అంతేకాదు కరోనా వ్యాక్సినేషన్ రెండో డోసులు తప్పనిసరిగా వేసుకోవాలని.. లేదంటే.. బహిరంగ ప్రదేశాలకు అనుమతి ఇవ్వబోమని హరియాణా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధన కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి అమలు కానున్నదని తెలిపింది.
దేశంలో ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతూ ఆందోళలన కాలిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: