దేశ వ్యాప్తంగా గ్యాంగ్‌స్టర్స్‌పై ఉక్కుపాదం మోపుతోంది ఎన్ఐఏ. మంగళవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా 70కిపైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్‌లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. గ్యాంగ్‌స్టర్స్, అక్రమ ఆయుధాల వ్యాపారులు ఇళ్లను జల్లెడపడుతున్నారు.
ఇప్పటివరకు జరిగిన దాడుల్లో రెండున్నర కోట్లకు పైగా నగదు, 11ఆయుధాలు సహా, పలు కీలక డాక్యుమెంట్స్, హార్డ్ డ్రైవ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. యూపీ బాగ్‌పత్‌లో ఈ తెల్లవారుజామున గ్యాంగ్‌స్టర్ సునీల్ రాఠీ, అతని అనుచరుల ఇళ్లలో సోదాలు చేశారు. 2022 ఆగస్ట్‌లో నమోదైన కేసుల ఆధారంగా ఈ రైడ్స్ చేసింది ఎన్ఐఏ.
పాకిస్థాన్ సహా విదేశాల్లో ఉన్న ఉగ్రవాద గ్రూపులు, డ్రగ్స్ స్మగ్లర్లతో కలిసి పనిచేస్తున్న గ్యాంగ్‌స్టర్స్‌పై రైడ్స్ చేసినట్టు తెలిపింది ఎన్ఐఏ. ఈ ముఠాలతో కలిసి పనిచేస్తున్న ఆయుధాల తయారీ దారులు, హవాలా ఆపరేటర్లపై ఫోకస్ పెట్టింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..