ISI Agent Arrest: ఐఎస్‌ఐ ఏజెంట్ అరెస్ట్

| Edited By:

Aug 31, 2020 | 4:43 PM

పాకిస్థాన్ ఐఎస్‌ఐ ఏజెంట్‌గా పని చేస్తున్న రజాక్ భాయ్ అనే వ్యక్తిని గుజరాత్ పశ్చిమ కచ్ జిల్లాలో ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) అరెస్ట్ చేసింది. యూపీలోని నమోదైన ఓ కేసు విచారణలో భాగంగా వచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు..

ISI Agent Arrest: ఐఎస్‌ఐ ఏజెంట్ అరెస్ట్
Follow us on

ISI Agent Arrest: పాకిస్థాన్ ఐఎస్‌ఐ ఏజెంట్‌గా పని చేస్తున్న రజాక్ భాయ్ అనే వ్యక్తిని గుజరాత్ పశ్చిమ కచ్ జిల్లాలో ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) అరెస్ట్ చేసింది. యూపీలోని నమోదైన ఓ కేసు విచారణలో భాగంగా వచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. యూపీలో పాక్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎండీ రషీద్ అనే వ్యక్తిని జనవరిలో అదుపులోకి తీసుకున్నారు అధికారులు. విచారణలో సదరు వ్యక్తి.. పాకిస్థాన్‌కు చెందిన రక్షణ, ఐఎస్ఐ అధికారులకు దేశ సమాచారం చేరవేసినట్లు గుర్తించారు. ఇప్పటివరకు రెండు సార్లు పాకిస్థాన్ వెళ్లి అక్కడి అధికారులతో భేటీ అయినట్లు నిర్థారించారు.

సమాచారం చేరవేసినందుకు గానూ గుజరాత్‌లోని రజాక్ భాయ్.. రషీద్‌కు పేటీఎం ద్వారా 50 వేల రూపాయలను జమ చేసినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు రషీద్‌కు నగదు పంపినట్లు తెలిపారు. దీంతో రజాక్‌ భాయ్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అతడి ఇంటిలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Read More:

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అప్‌డేట్.. పెద్ద సర్‌ప్రైజ్ మీకోసం

అమ్మాయిల వివాహ వయసు పెంచే ఆలోచనలో కేంద్రం

కోవిడ్‌తో టాలీవుడ్ నిర్మాత మృతి

బ్రేకింగ్: ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లీక్, వ్యక్తి మృతి

షాకింగ్ న్యూస్: కళ్ళద్దాలపై 9 రోజుల పాటు కరోనా?