Breaking: వైజాగ్‌ గ్యాస్‌ లీక్‌.. కేంద్ర, ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు..!

| Edited By:

May 07, 2020 | 2:45 PM

వైజాగ్‌ గ్యాస్‌ లీక్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హచ్‌ఆర్సీ) స్పందించింది. ఈ ఘటనపై స్పందించాలంటూ కేంద్ర, ఏపీ ప్రభుత్వాలకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. కాగా ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకైన ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. అస్వస్థతకు గురైన వేలాది మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్యాస్ ని అదుపులోకి తెచ్చినప్పటికీ.. అప్పటికే వాయువును పీల్చిన చాలా మంది ఎక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోతున్నారు. మూగజీవులు సైతం మృత్యువాతపడ్డాయి. మరోవైపు ఈ ఘటనపై […]

Breaking: వైజాగ్‌ గ్యాస్‌ లీక్‌.. కేంద్ర, ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు..!
Follow us on

వైజాగ్‌ గ్యాస్‌ లీక్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హచ్‌ఆర్సీ) స్పందించింది. ఈ ఘటనపై స్పందించాలంటూ కేంద్ర, ఏపీ ప్రభుత్వాలకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. కాగా ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకైన ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. అస్వస్థతకు గురైన వేలాది మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్యాస్ ని అదుపులోకి తెచ్చినప్పటికీ.. అప్పటికే వాయువును పీల్చిన చాలా మంది ఎక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోతున్నారు. మూగజీవులు సైతం మృత్యువాతపడ్డాయి. మరోవైపు ఈ ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి వైజాగ్‌కు వెళ్లారు. కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించిన జగన్‌.. అక్కడి అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం సైతం నిపుణుల బృందాన్ని వైజాగ్‌కు పంపనుంది.

Read This Story Also: గుండె తరుక్కుపోతోంది.. విశాఖ ఘటనపై సినీ, క్రీడా ప్రముఖుల ట్వీట్లు..!