మరికొద్ది క్షణాలు ఆగితే అప్పుడే పుట్టిన ఆ పాపాయి జీవితం పూర్తిగా ముగిసిపోయేది. పుట్టినరోజే లైఫ్ ఎండ్ అయ్యేది. కానీ అప్పుడే ఓ అద్బుతం జరిగింది. ఒడిశా కెందుఝర్ జిల్లాలో అరుదైన ఘటన వెలుగుచూసింది. వైద్యులు చనిపోయిందని నిర్ధారించిన శిశువు.. పూడ్చిపెట్టడానికి కొద్ది క్షణాల ముందు గుక్కపెట్టి ఏడ్చింది. జిల్లాలోని ఖందికపడ గ్రామంలో రాయ్మణి ముండా, సునియా ముండా జీవనం సాగిస్తున్నారు. గర్బవతి అయిన రాయ్మణి బుధవారం పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆనంతరం ఓ పండంటి బిడ్డకు జన్మినిచ్చింది. అయితే పాపాయి చనిపోయిందని వైద్యులు చెప్పారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకుంది. విధి రాత మార్చులేం అనుకుని.. మృత శిశువును ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం పూడ్చి పెట్టడానికి శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. గుంతలో పెట్టడానికి ముందు ఒక్కసారిగా గట్టిగా ఏడ్చింది శిశువు. దీంతో అక్కడివారు ఆశ్చర్యంలో మునిగిపోయారు. వెంటనే చిన్నారిని మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు నిర్లక్ష్యంగా బతికున్న శిశువును చనిపోయినట్లు చెప్పారని.. ఆస్పత్రి వద్ద బాధితుల బంధువులు ఆందోళన చేపట్టారు. బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా చిన్నారి ఇప్పుడు క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: కోడిపుంజును వెతుక్కుంటూ గడ్డివాము వైపు వెళ్లిన వ్యక్తి.. అక్కడ కనిపించిన సీన్ చూసి షాక్