భారత అంతరిక్ష పరిశోధనలు ప్రశంసించిన న్యూయార్క్ టైమ్స్

Updated on: Jul 06, 2023 | 6:21 PM

అంతరిక్షంపై ఎన్నోదేశాలు ఎప్పటినుంచో పరిశోధనలు జరుపుతూనే ఉన్నాయి. తాజాగా భారతదేశ అంతరిక్ష కార్యక్రమంపై అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక ప్రశంసల వర్షం కరిపించింది. స్పేస్ రంగంలో సాంకేతిక అభివృద్ధికి ఏర్పాటు చేసిన అంకుర సంస్థల కృషి గురించి వివరించింది.

1 / 6

2 / 6
ఇండియాలో విస్పోటనం లాగా సాంకేతిక అభివృద్ధి, కొత్త అన్వేషనల గురించి పరిశోధనలు జరుతున్నాయని తెలిపింది. త్వరలోనే భారత్ చైనాకు పోటీదారుగా మారుగలదని పేర్కొంది. ‘ప్రపంచ అంతరిక్ష వ్యాపారంలో ఆశ్చర్యపరిచే పోటీదారు’ అనే పేరుతో ప్రత్యేక వ్యాసాన్ని పబ్లిష్ చేసింది న్యూయార్క్ టైమ్స్.

3 / 6
1963లో మొదటగా రాకెట్ ప్రయోగం ప్రారంభించి నేడు ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజి గల దేశంగా ఇండియా ఆవిర్భవించిందని చెప్పింది. కరోనా ప్రారంభ సమయంలో భారత్‌లో అంతరిక్ష పరిశోధనలపై పనిచేసే అంకుర సంస్థలు కేవలం 5 ఉండేవని.. కానీ ఇప్పుడు 140 అంకుర సంస్థలు నమోదై ఉన్నాయని పేర్కొంది.

4 / 6
సాంకేతిక రంగంలో ఉన్నత స్థానానికి భారత్‌ ఎలా చేరుకుంటుందో వివరించింది. అలాగే గత నెలలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి వెలువరించిన సంయుక్త ప్రకటనను ఉటంకించింది. ఇరు దేశాల శత్రువైన చైనాను ఎదుర్కొనేందుకు ఇండియా, అమెరికాలకు అంతరిక్ష రంగం సరైన వేదిక కానుందని తెలిపింది.

5 / 6
అలాగే హైదరాబాద్‌ కేంద్రంగా అంతరిక్ష రంగంలో కృషి చేస్తున్న స్కైరూట్‌ ఏరోస్పేస్‌, ధ్రువ స్పేస్‌లను ఎన్‌వైటీ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించింది. తక్కువ ధరలో ఉపగ్రహ వాహకనౌకల సేవలు అందించేందుకు ఆ సంస్థలు చేస్తున్న ప్రయోగాలు, నూతన సాంకేతికతల అభివృద్ధి గురించి వివరించింది.

6 / 6
 ఇస్రోకు అవసరమైన పరికరాల తయారీకి బెంగళూరు, హైదరాబాద్‌, పుణే లాంటి నగరాల్లో 400కు పైగా ప్రైవేటు కంపెనీలు ఆవిర్భవించాయని వెల్లడించింది. అలాగే బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న అంకుర సంస్థలకి సంబంధించిన కొత్త ఆవిష్కరణల గురించి కూడా వివరించింది.