COVID BF.7: అప్రమత్తంగా ఉండండి.. ఆస్పత్రులను సిద్ధం చేసుకోండి.. కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు..

|

Dec 23, 2022 | 8:45 PM

నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని, అలాగే పరీక్షలను పెంచాలని, ఆసుపత్రి మౌలిక సదుపాయాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు సూచించింది. జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచడంపై దృష్టి సారించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది.

COVID BF.7: అప్రమత్తంగా ఉండండి.. ఆస్పత్రులను సిద్ధం చేసుకోండి.. కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు..
Ministry Of Health
Follow us on

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు లేఖ రాస్తూ కరోనాపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ సూచించింది. అలాగే, రాబోయే పండుగల సీజన్, నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని ‘టెస్ట్-ట్రాక్-ట్రీట్, వ్యాక్సినేషన్’పై దృష్టి పెట్టాలని లేఖలో రాష్ట్రాలను కోరింది. మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని, భౌతిక దూరం పాటించాలని రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్-19 నిర్వహణకు అన్ని సన్నాహాలను సిద్ధం చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. గత సారిగా కరోనా కేసుల పెరుగుదల సందర్భంగా కేంద్రం, రాష్ట్రాలు సహకార స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని, అలాగే పరీక్షలను పెంచాలని, ఆసుపత్రి మౌలిక సదుపాయాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు సూచించింది. జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచడంపై దృష్టి సారించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది.

జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పండుగలలో రద్దీని నియంత్రించడానికి, ఈవెంట్ నిర్వాహకులు, రెస్టారెంట్లు మొదలైన వాటితో సన్నిహితంగా పని చేయండి. వారికి పద్ధతులను చెప్పండి అంటూ సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి