Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి పెరిగిన వాయు కాలుష్యం.. ఇవాళ గాలి నాణ్యత ఎంత నమోదైందంటే..?

|

Nov 04, 2021 | 10:43 AM

దేశ రాజధాని ఢిల్లీని పట్టిపీడిస్తోన్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్నా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడంలేదు.

Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి పెరిగిన వాయు కాలుష్యం.. ఇవాళ గాలి నాణ్యత ఎంత నమోదైందంటే..?
Delhi Pollution
Follow us on

Delhi Pollution on Diwali: దేశ రాజధాని ఢిల్లీని పట్టిపీడిస్తోన్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్నా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడంలేదు. కాలుష్యానికి కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం వాయు కాలుష్య కారకులకు గరిష్ఠంగా ఐదేళ్ల జైలు, రూ.1 కోటి వరకు జరిమానా విధించేందుకు అవకాశం ఉంది. అయితే, తాజాగా దీపావళీ పర్వదినాన్ని పురస్కరించుకుని బాణాసంచా పేలుళ్ల కారణంగా మరోసారి వాయు కాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగింది.

ఢిల్లీలో గురువారం వాయుకాలుష్యం పెరిగింది. గాలి నాణ్యత సూచీ పేలవంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీపావళి పండుగ నేపథ్యం సూచీ మరింత దిగజారే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా (CBCB) ప్రకారం.. ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI) 352 నమోదైంది. అలాగే చాలా ప్రాంతాల్లో గురువారం ఉదయం 8 గంటల వరకు గాలి నాణ్యత సూచీ 300 కంటే ఎక్కువగా నమోదైంది. ఈ సాయంత్రానికల్లా మరింత పెరిగే అవకాశముందని అభిప్రాయపడింది.

అలాగే, ఐటీలోలో 354, అయానగర్‌లో 315, లోధిరోడ్‌ 303, మేజర్‌ ధ్యాన్‌చందన్‌ నేషన్‌ స్టేడియం 336, ఐజీఐ విమానాశ్రయం వద్ద 306, చాందినీచౌక్‌ 341, ద్వారకా సెక్టార్‌-8లో 340, ఓఖ్లా 359, శ్రీ అరబిందో మార్గ్ 329 గా నమోదైంది. అలాగే ఢిల్లీకి పొరుగున ఉన్న నగరాల్లో సూచీ పూర్‌ కేటగిరిలో ఉన్నది. ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ తీవ్ర కేటగిరిలోకి వచ్చే అవకాశం ఉందని మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌, ఎయిర్‌ క్వాలిటీ ఫోర్కాస్ట్ ఏజెన్సీ సఫర్‌ తెలిపింది.

Read Also… Lock Down Again: దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌..? ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ మొదలు.! మరోసారి పంజా విసురుతున్న కరోనా.. (వీడియో)