Rahul Gandhi: వయనాడ్‌ రగడ.. ఇండియా కూటమిలో కొత్త వివాదం.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహం..

|

Mar 09, 2024 | 12:23 PM

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమిలో కొత్త వివాదం మొదలైంది. కేరళ వాయనాడ్‌ నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎంపీ రాహుల్ గాంధీ మళ్లీ బరిలో ఉంటారని కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల చేసిన కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. అయితే వాయనాడ్‌ నుంచి ఈసారి బరిలో ఉంటామని ఇప్పటికే సీపీఐ ప్రకటించడంతో మిత్రపక్షాల మధ్య పోరు తప్పేలా లేదు.

Rahul Gandhi: వయనాడ్‌ రగడ.. ఇండియా కూటమిలో కొత్త వివాదం.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహం..
Annie Raja - Rahul Gandhi
Follow us on

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్ష ఇండియా కూటమిలో కొత్త వివాదం మొదలైంది. కేరళ వాయనాడ్‌ నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎంపీ రాహుల్ గాంధీ మళ్లీ బరిలో ఉంటారని కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల చేసిన కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. అయితే వాయనాడ్‌ నుంచి ఈసారి బరిలో ఉంటామని ఇప్పటికే సీపీఐ ప్రకటించడంతో మిత్రపక్షాల మధ్య పోరు తప్పేలా లేదు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా భార్య అనీ రాజా ఇక్కడ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్‌ ఫస్ట్‌ లిస్ట్‌ కూడా విడుదల కావడంతో సీపీఐ పోటీ నుంచి విరమించుకుంటుందా లేక బరిలో కొనసాగుతామని ప్రకటిస్తుందా అనేది తేలాల్సి ఉంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ, వాయనాడ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు రాహుల్. నాటి ఎన్నికల్లో అమేథీలో రాహుల్‌ను బీజేపీ అభ్యర్థి స్మృతీఇరానీ ఓడించారు. అదే సమయంలో వయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలుపొందారు రాహుల్. నాటి నుంచి నియోజకవర్గంపై పూర్తిగా దృష్టి సారించి భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు రాహుల్‌. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో వాయనాడ్ ఎంపీగా అనర్హత వేటు పడటం ఆ వెంటనే పునరుద్దరణ జరడగం చకచకాజరిగిపోయాయి. పరువు నష్టం కేసులో దోషిగా నిలబడి వాయనాడ్ కోల్పోయే పరిస్థితి ఏర్పడినా కోర్టు తీర్పుతో రాహుల్‌కు రిలీఫ్ దక్కింది.

వీడియో చూడండి..

ఇప్పటికే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహంలా ఇండియా కూటమిలోని పక్షాలు పరస్పరం ఢీ కొంటున్నాయి. ఢిల్లీలో పొత్తు ఉన్నా ఆమ్‌ ఆద్మీ పార్టీ-కాంగ్రెస్‌ పంజాబ్‌లో పరస్పరం తలపడుతున్నాయి. ఇప్పుడు కేరళలో కూడా ఇండియా కూటమిలోని పక్షాలు అన్ని నియోజకవర్గాల్లో పరస్పరం తలపడతాయా లేక వయనాడ్‌ స్థానానికి మాత్రమే పరిమితమౌతాయా అనే విషయంలో ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..