Corona Cases India: ఇండియా కరోనా అప్‌డేట్.. కొత్తగా 15,590 పాజిటివ్ కేసులు, 191 మరణాలు..

|

Jan 15, 2021 | 12:59 PM

Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,590 మందికి కరోనా పాజిటివ్‌‌గా నిర్దారణ అయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది...

Corona Cases India: ఇండియా కరోనా అప్‌డేట్.. కొత్తగా 15,590 పాజిటివ్ కేసులు, 191 మరణాలు..
Follow us on

Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,590 మందికి కరోనా పాజిటివ్‌‌గా నిర్దారణ అయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనితో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,05,27,683కి చేరింది. నిన్న కొత్తగా 15,975 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక, ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 1,01,62,738 కోలుకున్నారు. కాగా, బుధవారం ఒక్కరోజే 191 మంది కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,51,918కు చేరింది. ప్రస్తుతం దేశంలో 2,13,027 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.