NEET Exam Scam: నీట్ ఎగ్జామ్ కుంభకోణం.. ఈ స్కామ్ ఇప్పుడు దేశాన్ని షేక్ చేస్తోంది. ఎంతలా అంటే.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇదే టాక్ ఆఫ్ టౌన్‌గా మారిపోయింది. ఎందుకంటే.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను మార్చురీలోకి పంపేస్థాయికి చేరుకుంది. ఈ కరోనా సమయంలో నిద్రహారాలు మాని.. బుక్స్‌తో కుస్తీ పట్టి చదవిన చదువు ఎందుకు పనికి రాదా? మళ్లీ బుక్స్ పట్టాల్సిందేనా? అన్న లెవల్‌లో చర్చ సాగుతోంది.
ఎందుకంటే.. దేశ వ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే సంస్థ ద్వారానే ప్రధాన ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయి. మెడికల్ నుంచి NET, గేట్ వరకు ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తుంది. మొదట్లో పక్కాగా నిర్వహించినా.. కొద్ది రోజులకే సంస్థ కీర్తి అబాసు పాలవుతోంది. కష్టపడి చదువుకున్న విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. ఇప్పటి వరకు ఎంతో మంది స్టూడెంట్స్ లైఫ్‌లను నాశనం చేసింది. ఇప్పుడు తాజాగా మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇంతకు ఈ పరీక్ష ఉంటుందా? రద్దు చేస్తారా? ఉంటే కాపీయింగ్ చేసిన విద్యార్థులతో పోల్చితే మామూలు విద్యార్థుల గతి ఏంటి? ఏళ్లుగా బుక్స్‌తో కుస్తీ పడి చదివిన వారి భవిష్యత్ ఏంటి? అన్న ప్రశ్నలు వెంటాడుతున్నాయి.
ఈ నెల 12న దేశ వ్యాప్తంగా నీట్-2021 పరీక్ష జరిగింది. ఆ తర్వాత ఈ పరీక్షపై ఎన్నోఎన్నో అనుమానాలు, అపవాదాలు తెరమీదకు వచ్చాయి. వాటికి బలం చేకూర్చుతూ రాజస్తాన్ రాష్ట్రం జైపూర్‌లో స్కామ్ బాంబ్ పేలింది. అది కాస్త దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జైపూర్ పోలీసులు కూడా ఈ లీక్‌ను నిర్ధారించారు. దీనితో సంబంధం ఉన్న 8 మందిని అరెస్ట్ చేశారు. నీట్ పరీక్ష మొదలైన అరగంటలోనే వాట్సాప్ ద్వారా లీక్ అయినట్టు గుర్తించారు. రాజస్తాన్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పరీక్ష కేంద్రం నుంచి నీట్ కోచింగ్ సెంటర్ ఓనర్ నవ రత్న స్వామి ఈ యవ్వారం నడిపినట్టు పోలీసుల విచారణలో తేలింది. అటు తర్వాత జరిపిన విచారణలో అభ్యర్థి ధేశ్వరియాదవ్‌తో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల విచారణలో పలు సంచలనాలు వెలుగు చూశాయి. ఒక్కో అభ్యర్థి నుంచి మెడికల్ మాఫియా 35 లక్షలతో డీల్ ఓకే చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనంతటికి మూల కేంద్రం నీట్ పరీక్ష కేంద్రం నుంచే జరిగినట్టు గుర్తించారు. ఎగ్జామ్ సెంటర్‌లోని ఇన్విజిలేటర్ ద్వారా క్వశ్చన్ పేపర్‌ను ఫోటో తీసి వాట్సాప్ ద్వారా మెడికల్ మాఫియాకు పంపారు. అప్పటికే రెడీగా ఉన్న నిపుణులు క్వశ్చన్స్‌కు ఆన్సర్‌ను గుర్తించి.. మళ్లీ ఆన్సర్ షీట్‌ను పరీక్ష కేంద్రానికి పంపించారు. పరీక్ష ముగిసే సమయంలో ఆన్సర్‌తో కూడుకున్న OMR షీట్‌ను అభ్యర్థులకు ఇచ్చి పరీక్ష రాయించారని తేలింది.
ఒక్క జైపూరే కాదు.. ఇటు మహారాష్ట్రలోనూ ఇదే ఇష్యూ ప్రకంపనలు సృష్టిస్తోంది. రంగంలోకి దిగిన CBI కోచింట్ సెంటర్స్, విద్యార్థుల నిర్వాహకాన్ని రట్టు చేసింది. కొంత మందిపై కేసు కూడా నమోదు చేసింది. అసలు విద్యార్థుల స్థానంలో మరో విద్యార్థితో పరీక్ష రాయించినట్టు తేలింది. ఒక్కో అభ్యర్థికి 50 లక్షలు చెల్లించినట్టు గుర్తించారు అధికారులు. కొన్ని కేసుల్లో దరఖాస్తుల డేటాను మార్చారని, మరికొన్ని కేసుల్లో OMR షీట్లను కూడా మార్చారని విచారణలో తెలిసింది.
నాగ్‌పూర్‌కు చెందిన RK ఎడ్యూకేషన్ కెరీర్ గైడెన్స్ సంస్థ ప్రధాన మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామని కొంత మంది ప్రాక్సీ విద్యార్థులతో పరీక్ష రియించినట్టు సీబీఐకి సమాచారం అందింది. ముందుగానే దళారులు.. విద్యార్థుల పేరెంట్స్ నుంచి పోస్ట్ డేటెడ్ చెక్కులు, ఒరిజినల్ సర్టిఫికేట్స్‌ను తీసుకున్నారు. ఆ తర్వాతనే ఈ తతంగం అంతా సాగినట్టు గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన అనికేత్ తారాపురే రాంచి సెంటర్‌లో, హృతిక్ మెహిత్ ఢిల్లీ రోహిత్ సెక్టార్ సెంటర్, రితేష్ భాజిపాల్ ఢిల్లీ మాయపురి సెంటర్, రుషికేష్ తొంబ్రే ఢిల్లీలోని షాలిమార్ బాగ్ సెంటర్, సుభం సంగ్రోల్ ఢిల్లీలోని రహిణి సెక్టార్ సెంటర్‌లో పరీక్ష రాసినట్టు తేలింది. దీనికి సంబంధించిన క్యాష్ లావాదేవీలను కూడా CBI లధికారులు గుర్తించారు.
ఈ భాగోతం అంతా తేలిన తర్వాత NTA సంస్థపై విద్యార్థుల్లో నమ్మకం పోయింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థను నాట్ ట్రూత్‌వర్త్ ఏజెన్సీగా మారిందని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also: Kidnap: హైదరాబాద్ అమీర్‌పేట్‌లో కలకలం.. ఇద్దరు మహిళల్ని కిడ్నాప్ చేసిన దుండగులు