Vice-President Polls: ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా జగ్‌దీప్ ధన్కర్ నామినేషన్.. వెంటవచ్చిన ప్రధాని మోదీ.. ఎన్నికలు ఎప్పుడంటే..
Vice-President Election 2022: ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా జగ్‌దీప్ ధన్కర్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా , కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా హాజరయ్యారు.
ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా జగ్‌దీప్ ధన్కర్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా , కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా హాజరయ్యారు. వచ్చే నెల 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. విపక్షాల అభ్యర్ధిగా మార్గరెట్ అల్వా పేరును ప్రకటించారు. ధన్కర్ – మార్గరెట్ అల్వా మధ్య పోటీ జరుగుతుంది. ధన్కర్ నామినేషన్ కార్యక్రమానికి ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు కూడా హాజరయ్యారు. బెంగాల్ గవర్నర్‌గా ఉన్న ధన్కర్‌ను బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించారు.
గతంలో సుప్రీంకోర్టు అడ్వొకేట్‌గా పనిచేశారు జగ్‌దీప్ ధన్‌కర్. 1989-91 మధ్య జున్‌జున్ నియోజక వర్గం నుంచి ఎంపీగా పనిచేశారు. జనతాదళ్ నుంచి ఎంపీగా గెలిచారు. రాజస్థాన్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యరు. 71 ఏళ్ళ జగదీప్ ధన్‌కర్ స్వస్థలం రాజస్థాన్. రాజస్థాన్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. రాజస్థాన్ లోని కిషన్‌గంజ్ నుంచి 1993-98 మధ్య ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1990లో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.
లోక్‌సభతో పాటు రాజస్థాన్ అసెంబ్లీలో వివిధ కమిటీలో పనిచేశారు. క్రీడలంటే కూడా ఆయనకు చాలా ఆసక్తి. రాజస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్ , రాజస్థాన్ టెన్నీస్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 నుంచి బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2003లో బీజేపీలో చేరారు జగ్‌దీప్ ధన్‌కర్. బెంగాల్ గవర్నర్‌గా జగ్‌దీప్ ధన్‌కర్ పనితీరును పరిశీలించిన తరువాతే బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించింది.
#WATCH | Delhi: NDA candidate Jagdeep Dhankhar files his nomination for the Vice Presidential elections in the presence of PM Narendra Modi.
(Source: DD) pic.twitter.com/jyUOddtxOe
— ANI (@ANI) July 18, 2022
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా ఇంకా నామినేషన్ దాఖలు చేయలేదు. మంగళవారంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ల గడువు ముగియనుంది.