రెచ్చిపోయిన నక్సల్స్‌.. అటవీశాఖ కార్యాలయం, క్వార్టర్స్‌ పేల్చివేత..

జార్ఖండ్‌లో నక్సల్స్‌ మరోసారి రెచ్చిపోయారు. ముఫ్సిల్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి అటవీ శాఖకు చెందిన కార్యాలయాన్ని పేల్చివేశారు. అంతేకాదు అక్కడే ఉన్న క్వార్టర్స్‌ను కూడా పేల్చేశారు. దీంతో అక్కడ..

రెచ్చిపోయిన నక్సల్స్‌.. అటవీశాఖ కార్యాలయం, క్వార్టర్స్‌ పేల్చివేత..

Updated on: Jul 12, 2020 | 3:37 PM

జార్ఖండ్‌లో నక్సల్స్‌ మరోసారి రెచ్చిపోయారు. ముఫ్సిల్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి అటవీ శాఖకు చెందిన కార్యాలయాన్ని పేల్చివేశారు. అంతేకాదు అక్కడే ఉన్న క్వార్టర్స్‌ను కూడా పేల్చేశారు. దీంతో అక్కడ ఉన్న భవనాలు కుప్పకూలాయి. అంతేకాదు అందులో ఉన్న వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. భవనాలను పేల్చేసిన తర్వాత అక్కడ కొన్ని పోస్టర్లను కూడా అతికించారు. అందులో కొందర్ని హెచ్చరిస్తూ రాసినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని జార్ఖండ్‌ చైబాసా ఎస్పీ ఇంద్రజీత్ తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us