ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీ ఘటనకు నిరసనగా చండీగఢ్‌లోని పంజాబ్ గవర్నర్ హౌస్ ముట్టడించిన నవజ్యోత్ సింగ్ సిద్ధును పోలీసులు అదులోకి తీసుకున్నారు. సిద్ధుతోపాటు పలువురు పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా అదుపులోకితీసుకున్నారు. గవర్నర్ హౌస్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడంతో చండీగఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ అనేక ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్మికులతో కలిసి లఖింపూర్ ఖేరీ ఘటనకు వ్యతిరేకంగా మధ్యాహ్నం 1 గంటల సమయంలో చండీగఢ్‌లోని పంజాబ్ గవర్నర్ హౌస్ వెలుపల అకస్మాత్తుగా చేరుకున్నారు.
पंजाब: कांग्रेस नेता नवजोत सिंह सिद्धू के नेतृत्व में पंजाब कांग्रेस ने चंडीगढ़ में लखीमपुर खीरी की घटना को लेकर विरोध प्रदर्शन किया। pic.twitter.com/xbflciuhQL
— ANI_HindiNews (@AHindinews) October 4, 2021
ఇక ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీలో ఉద్రిక్తతను తగ్గించడానికి యోగి సర్కార్ నష్టనివారణ చర్యలు చేపట్టింది.
రైతులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సక్సెసయ్యాయి. చనిపోయిన రైతుల కుటుంబాలకు 45 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. గాయపడ్డవాళ్లకు 10 లక్షల చొప్పున సాయం ప్రకటించారు.
యూపీ లఖీంపూర్ ఖేరీలో హై టెన్షన్ మాత్రం కొనసాగుతోంది. నిన్న రైతుల ఆందోళనల్లో జరిగిన హింసాత్మక ఘటనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. ఈ ఘటనపై ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న విపక్ష సభ్యులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు.
ఇవి కూడా చదవండి: Consumer Right: మీరు తినే ఐస్ క్రీం ప్రమాదకారి కావొచ్చు.. తెలుసా..? ఆ కోడ్ లేకపోతే నకిలీదే..