Clashes At Delhi: ఘర్షణలపై భగ్గుమన్న విపక్షాలు.. ప్రధాని మౌనం వల్లే ఈ దురాగతాలు అంటూ ఫైర్..!

|

Apr 17, 2022 | 6:10 AM

Clashes At Delhi: దేశంలో పలుచోట్ల మతఘర్షణలు చెలరేగడంపై విపక్ష నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మౌనం కారణంగానే అల్లరిమూకలు మరింత

Clashes At Delhi: ఘర్షణలపై భగ్గుమన్న విపక్షాలు.. ప్రధాని మౌనం వల్లే ఈ దురాగతాలు అంటూ ఫైర్..!
Congress
Follow us on

Clashes At Delhi: దేశంలో పలుచోట్ల మతఘర్షణలు చెలరేగడంపై విపక్ష నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మౌనం కారణంగానే అల్లరిమూకలు మరింత చెలరేగుతున్నాయని 13 పార్టీల విపక్ష నేతల సంతకాలతో ఉమ్మడి ప్రకటన విడుదలయ్యింది. ఈ మేరకు దేశంలో శాంతి, సామరస్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు 13 విపక్ష పార్టీల నేతలు. మతహింస, విద్వేషపూరిత ప్రసంగాలతో దేశంలో ప్రమాదకరమైన పరిస్థితులు కన్పిస్తున్నాయని విపక్ష నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. మతవిద్వేషాలను రెచ్చగొడుతూ , అల్లర్లకు పాల్పడుతున్న వాళ్లను కఠినంగా శిక్షించాలని కోరారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ , తమిళనాడు సీఎం స్టాలిన్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజాతో పలువురు నేతలు ఈ లెటర్‌పై సంతకాలు చేశారు.

దేశమంతా అల్లర్లు చెలరేగుతుంటే ప్రధాని మోదీ పెదవి విప్పడం లేదని విపక్ష నేతలు విమర్శించారు. ప్రధాని మౌనం కారణంగానే అల్లరిమూకలు మరింత చెలరేగుతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌, తృణమూల్‌, డీఎంకే, ఆర్జేడీ, లెఫ్ట్‌ నేతల పార్టీలు ఈ లేఖపై సంతకాలు చేశారు. శివసేన, ఆప్‌ నేతల సంతకాలు మాత్రం ఈ లేఖలో లేవు.

ఆహారం, దుస్తులు, పండుగలు, భాష పేరుతో మైనారిటీలపై ఆంక్షలు విధించడం దేశంలో ప్రమాదకరమైన పరిస్థితులకు దారి తీస్తుందని విపక్ష నేతలు హెచ్చరించారు. అన్ని వర్గాలు, మతాలను సమదృష్టితో చూసినప్పుడు దేశం అన్నిరంగాల్లో అభివృద్ది చెందుతుందని హితవు పలికారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న వాళ్లను అధికారంలో ఉన్నవాళ్లే ప్రోత్సహిస్తున్నారని విపక్ష నేతలు విమర్శించారు. వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు ఇప్పటివరకు కన్పించలేదని లేఖలో పేర్కొన్నారు.

Also read:

Delhi Files – Vivek Agnihotri: ఇక ‘ఢిల్లీ ఫైల్స్’.. సంచలన ప్రకటన చేసిన వివేక్ అగ్నిహోత్రి..

Viral Video: ఈ రైతు చాలా స్మార్ట్ గురూ.. పొలం పనుల్లో సరికొత్త ప్రయోగం.. మీకూ ఉపయోగపడొచ్చు ఓ లుక్కేయండి..!

Russia – Ukraine War: పుతిన్‌కు ఆగ్రహం కలిగించిన ఆ ఘటన.. సైన్యానికి కీలక ఆదేశాలు జారీ..!