Corona Virus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంది మహారాష్ట్రలో కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ అయితే ఎక్కడ ఓ రెండు గ్రామాల్లో మాత్రం కరోనా కేసులు నమోదు కాకుండా అందరికీ షాక్ఇస్తుంది. ఆ గ్రామాల్లో ఒక్కకేసులు కూడా నమోదు కాకపోవడానికి కారణం ఓ మొక్క యొక్క ఔషధాలే అని అంటున్నారు. ఆ గ్రామాలు ఏమిటి, మొక్క గురించి వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్ర లోని కరోనా కల్లోలం సృష్టిస్తున్నా.. నాగపూర్ జిల్లాల్లోని తుమ్డీ, జునాపానీ అనే రెండు గ్రామాల్లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇందుకు తమ గ్రామంలో గల ‘భూయి వేప’ మొక్కలే కారణమని అంటున్నారు స్థానికులు. ఈ మొక్కను ఔషదాల తయారీలో ఉపయోగిస్తారని.. తాము ఈ భూయి నీమ్ మొక్క ఆకులతో తయారు చేసిన రసాన్ని తాగుతూ ఆరోగ్యంగా ఉన్నామని చెబుతున్నారు.
అడవిలోకి లభ్యమయ్యే భూయి వేప మొక్కల ఆకులను తెచ్చుకుని జ్యూస్ లేదా నీటిలో ఉడికించి ఉదయాన్నే పరగడపున తాగుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకనే తమకు కరోనా సోకలేదని.. చెప్పడమే కాదు.. ఈ గ్రామస్థులు ఎవరూ కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు..తమ గ్రామంలో ఉన్న వేప మొక్కలను నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి తమ గ్రామాన్ని రక్షిస్తుందని అంటున్నారు. ఇదే అంశంపై జునాపానీకికి చెందిన ఓ రైతు స్పందిస్తూ.. తమ గ్రామంలో 40 కుటుంబాలు నివసిస్తున్నాయని, వీరిలో ఎవరికీ కరోనా సోకలేదని తెలిపారు.”భూయి వేప మొక్క ఆకులను మేం ఔషదంగా ఉపయోగిస్తాం. జ్వరం, దగ్గు, జలుబు నుంచి ఈ మొక్క ఉపశమనం కలిగిస్తుంది. మాకు వ్యాక్సిన్‌తో కూడా పని ఉండదు. అయినా తమ గ్రామానికి వ్యాక్సిన్ కేంద్రం ఇక్కడికి 12 కిమీల దూరంలో ఉంది.. అధికారులు తమ గ్రామానికి వచ్చి వ్యాక్సిన్ తీసుకోమని చెబుతున్నారు. దూరంగా ఉండడంతో ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదని చెప్పారు. తెహసిల్‌లో నివసిస్తున్న తన మావయ్య కరోనాతో మరణిస్తే.. అంత్యక్రియలకు కూడా హాజరయ్యాను. అయినప్పటికీ తనకు కరోనా సోకలేదని చెప్పాడు. రాజేష్ లాఖా అనే మరో గ్రామస్తుడు ఇదే విషయంపై మాట్లాడుతూ.. ”మా ఊరిలో కరోనా మాత్రమే కాదు, అభివృద్ధి పనులు కూడా లేవు. రోడ్లు, విద్యుత్ సదుపాయాలు కూడా లేవు” అని తెలిపాడు.
నాగపూర్‌కు సుమారు 30 కిమీల దూరంలో ఉన్న తుమ్డీ గ్రామంలో సుమారు 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. కానీ, వారిలో ఎవరికీ కరోనా సోకలేదు. తమ ఊరు నుంచి బయటకు వెళ్లేవారు తక్కువ మందని… పైగా, బయటకు వెళ్లి వచ్చినవారు తప్పకుండా బయట స్నానం చేసిన తర్వాతే ఇంట్లోకి వెళ్తామని చెప్పారు. ఈ రూల్ తమ గ్రామానికి ఎవరు వచ్చినా పాటించాల్సిందే నని స్పష్టం చేశారు. . తమ అలవాట్లే తమని కరోనా నుంచి కాపాడుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. ఈ ఊరికి కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న మంగ్రాడ్‌లో మాత్రం కరోనా కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో ప్రతి కుటుంబంలో ఒకరైనా కరోనా బాధితులుగా మారుతున్న సమయంలో ఈ గ్రామాన్ని మాత్రం కోవిడ్ తాకలేదు. ఇంకా చెప్పాలంటే మన ఏపీలో ఆనందయ్య తరహాలోనే అక్కడ ఒక మొక్క ఇంత అద్భుతం చేస్తుందంటే ఆశ్చర్యకరమే. మరి దీనిపై ఆరోగ్య నిపుణులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
Also Read: హనుమంతుడి జయంతి పై , విశాఖ శారదా పీఠం పై ఘాటు వ్యాఖ్యలు చేసిన గోవిందానంద స్వామి..