ఈ మగ ‘నాగు’తో పెళ్లా..? నో..నో.. వధువు షాకింగ్ డెసిషన్

| Edited By:

Nov 11, 2019 | 11:58 AM

ప్రతి పెళ్లిలోనూ ఉత్సాహంగా నాగిని డ్యాన్స్ చేయడమన్నది సాధారణంగా అన్ని ప్రాంతాల్లో చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు అదే నాగిని డ్యాన్స్ విడాకులకు కారణమైంది. పెళ్లైన వెంటనే నాగిని డ్యాన్స్ చేస్తోన్న వరుడికి వెంటనే విడాకులు చెప్పేసింది ఆ పెళ్లికూతురు. ఈ సంఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. లఖింపూర్ ఖేర్‌లోని మైలానీ అనే ప్రాంతంలో శుక్రవారం ఓ వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో బరాత్‌‌ను పూర్తి చేసుకున్న ఓ పెళ్లికొడుకు.. ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నాడు. […]

ఈ మగ నాగుతో పెళ్లా..? నో..నో.. వధువు షాకింగ్ డెసిషన్
Follow us on

ప్రతి పెళ్లిలోనూ ఉత్సాహంగా నాగిని డ్యాన్స్ చేయడమన్నది సాధారణంగా అన్ని ప్రాంతాల్లో చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు అదే నాగిని డ్యాన్స్ విడాకులకు కారణమైంది. పెళ్లైన వెంటనే నాగిని డ్యాన్స్ చేస్తోన్న వరుడికి వెంటనే విడాకులు చెప్పేసింది ఆ పెళ్లికూతురు. ఈ సంఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. లఖింపూర్ ఖేర్‌లోని మైలానీ అనే ప్రాంతంలో శుక్రవారం ఓ వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో బరాత్‌‌ను పూర్తి చేసుకున్న ఓ పెళ్లికొడుకు.. ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నాడు. అక్కడ తన సన్నిహితులతో కలిసి ఆ వరుడు డ్యాన్స్ చేస్తుండగా.. పెళ్లికూతురు తరఫున వారు వచ్చి అతడిని వివాహవేదికకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆల్కహాల్ సేవించిన ఆ వరుడు వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అక్కడ గొడవ మొదలుకాగా.. ఎలాగోలా సర్ధిచెప్పిన పెద్దలు అతడిని వేదిక వద్దకు తీసుకెళ్లారు. అక్కడ దండలు మార్చుకున్న వెంటనే.. మళ్లీ కిందికి వెళ్లి నాగిని డ్యాన్స్ చేశాడు. దీంతో విసుగెత్తిపోయిన ఆ వధువు తనకు ఈ పెళ్లి వద్దంటూ చెప్పేసి.. వేదికను దిగి వెళ్లిపోయింది. ఆమెను బుజ్జగించేందుకు పెద్దలు రంగంలోకి దిగినా.. వారి మాట వినలేదు. ఈ క్రమంలో వధువును వరుడు కొట్టినట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి అక్కడ గొడవ పెద్దది కావడంతో.. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అయితే దీనిపై కేసును నమోదు చేయడానికి ఇరు కుటుంబాలు అభ్యంతరం చెప్పడంతో.. వారు వెనక్కి వచ్చేశారు. ఇక ఈ సంఘటన తరువాత పెళ్లి కుమారుడు తరపు వాళ్లు కూడా వెంటనే ఆ మాల్‌ను వదిలి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.