మరో శ్రద్ధా హత్య కేసు..! ప్రియురాలిని ముక్కలుగా చేసిన ప్రియుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే..

|

Feb 20, 2023 | 7:58 AM

జనవరి 20న ఆమె పుట్టింటి నుంచి వెళ్లిపోయింది. అత్తమామల ఇంటికి వెళుతున్నానని చెప్పింది. కానీ, ఆ రోజు ఆమె తన అత్తమామల ఇంటికి చేరుకోలేదు. మహిళ కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.

మరో శ్రద్ధా హత్య కేసు..! ప్రియురాలిని ముక్కలుగా చేసిన ప్రియుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే..
Nagaur Murder Case
Follow us on

ఢిల్లీలో జరిగిన శ్రద్ధా హత్య కేసు సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అలాంటి ఘటనే ఇప్పుడు మరోకటి రాజస్థాన్‌లో కలకలం రేపింది. రాజస్థాన్‌లోని నాగౌర్‌లో ఘటన చోటుచేసుకుంది . ఓ వ్యక్తి తన ప్రియురాలిని తానే చంపేశాడు . ప్రియురాలిని హతమార్చిన అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. అనంతరం పోలీసులకు దొరకకుండా ఉండేందుకు.. ఆ శరీర భాగాలను బావిలో విసిరేశాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చనిపోయిన మహిళ పేరు గుడ్డి అని చెబుతున్నారు. ఆ మహిళ గత కొన్ని రోజులుగా హఠాత్తుగా అదృశ్యమైంది. ఉన్నట్టుండి మహిళ కనిపించకుండా పోవటంతో బంధువులు చుట్టుపక్కలంతా గాలించారు. తెలిసిన వారు, బంధువుల ఇళ్లలోనూ వెతికారు. అయితే ఆచూకీ తెలియకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన మహిళ ఆచూకీ కోసం గాలిస్తుండగానే మహిళ ప్రేమికుడి గురించిన విషయం తెలిసింది. దాంతో అనుమానం వచ్చిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు.. తమదైన స్టైల్లో విచారించగా, అతడు నేరాన్ని అంగీకరించాడని పోలీసు అధికారి తెలిపారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని దాచేందుకు ముక్కలు ముక్కలుగా నరికినట్లు చెప్పాడు. అనంతరం దేర్వా గ్రామ సమీపంలోని బావిలో పడేశాడు. నిందితుడి చెప్పిన వివరాల మేరకు.. పోలీసులు మృతదేహం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మృతురాలు.. నాగౌర్ జిల్లా శ్రీ బాలాజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాసర్ గ్రామ నివాసి వివాహిత. జనవరి 20న ఆమె పుట్టింటి నుంచి వెళ్లిపోయింది. అత్తమామల ఇంటికి వెళుతున్నానని చెప్పింది. కానీ, ఆ రోజు ఆమె తన అత్తమామల ఇంటికి చేరుకోలేదు. మహిళ కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. మాల్వా రోడ్డు సమీపంలో మహిళ బట్టలు, తల వెంట్రుకలను గుర్తించారు పోలీసులు. బంధువుల రక్త నమూనాలను తీసుకొని మృతదేహం ముక్కలతో డీఎన్‌ఎ మ్యాచ్ చేశారు. వైద్య పరీక్షల్లో మృతదేహం ముక్కలు మహిళకు చెందినవని తేలింది.

ఇవి కూడా చదవండి

నిందితులకు పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా నిర్వహిస్తామని ఓ పోలీసు అధికారి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..