First Dating: ‘సర్‌.. నా డ్రీమ్‌ గర్ల్‌తో డేటింగ్‌కి వెళ్లాలి! కాస్త డబ్బు సర్దండి’ ఎమ్మెల్యేకి ఓ లవర్‌ బాయ్‌ విజ్ఞప్తి

ప్రేమ కోసం ఓ రోమియో నానాపాట్లు పడుతున్నాడు. సాధారణంగా కలల రాణిని సొంతం చేసుకోవడానికి స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల సహాయసహకారాలు కోరుతుంటారు. అయితే ఈ ప్రేమికుడు మాత్రం కాస్త వెరైటీ. ఏకంగా ఓ ఎమ్మెల్యేను సహాయం కోరుతూ దరఖాస్తు పెట్టుకున్నాడు. అదేంటీ? అని అనుకుంటున్నారా? అతగాడి ప్రేమకు ఎమ్మెల్యే ఏం చేస్తాడు.. అనేగా మీ సందేహం. సాధారణంగా రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి ఉద్యోగాలు, అడ్మినిస్ట్రేటివ్ పనులు, వివాహాలు..

First Dating: సర్‌.. నా డ్రీమ్‌ గర్ల్‌తో డేటింగ్‌కి వెళ్లాలి! కాస్త డబ్బు సర్దండి ఎమ్మెల్యేకి ఓ లవర్‌ బాయ్‌ విజ్ఞప్తి
Youth in love seeks money from BJP leader for going date

Updated on: Oct 30, 2023 | 9:46 AM

కోహిమా, అక్టోబర్ 30: ప్రేమ కోసం ఓ రోమియో నానాపాట్లు పడుతున్నాడు. సాధారణంగా కలల రాణిని సొంతం చేసుకోవడానికి స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల సహాయసహకారాలు కోరుతుంటారు. అయితే ఈ ప్రేమికుడు మాత్రం కాస్త వెరైటీ. ఏకంగా ఓ ఎమ్మెల్యేను సహాయం కోరుతూ దరఖాస్తు పెట్టుకున్నాడు. అదేంటీ? అని అనుకుంటున్నారా? అతగాడి ప్రేమకు ఎమ్మెల్యే ఏం చేస్తాడు.. అనేగా మీ సందేహం. సాధారణంగా రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి ఉద్యోగాలు, అడ్మినిస్ట్రేటివ్ పనులు, వివాహాలు – వైద్య అత్యవసర పరిస్థితుల కోసం ఆర్థిక సహాయం కావాలంటూ సంప్రదిస్తుంటారు. ఇతగాడాడు తన కలల రాణితో ప్రేమ వ్యవ హారం సాగించేందుకు డబ్బు సర్దాలంటూ ప్రాధేయపడ్డాడు. ఈ విచిత్ర సంఘటన నాగాలాండ్‌లో వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే..

బీజేపీ నాగాలాండ్‌ అధ్యక్షుడు టెమ్‌జెన్‌ ఇమ్నా అలోంగ్‌ తనకు ఎదురైన విచిత్ర అనుభవాన్ని స్వయంగా తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో నెటిజన్లతో పంచుకున్నాడు. అరవింద పాండా అనే ఓ యువకుడు తన ‘డ్రీమ్‌ గర్ల్‌’తో డేటింగ్‌ వెళ్లేందుకు ఆర్థిక సాయం కోరుతూ మెయిల్‌ పెట్టాడట. ఆ మెయిల్‌లో ఇలా ఉంది.. ‘సర్, అక్టోబర్‌ 31వ తేదీన నా డ్రీమ్ గర్ల్‌తో మొదటిసారిగా డేటింగ్‌కు వెళ్లబోతున్నాను. కానీ ఇప్పటి వరకు నాకు ఉద్యోగం కూడా రాలేదు. కాబట్టి దయచేసి నాకు ఓ చిన్న సాయం చేయం చేసిపెట్టండి. ఏదో ఒకటి చేయండి సార్‌’ అని అందులో రాసుకొచ్చాడు. అందుకు ఎమ్మెల్యే నేనేం చేయాలో, ఎలాంటి సాయం కావాలో చెప్పండి’ అంటూ బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన మెయిల్ స్క్రీన్‌షాట్‌ను ట్విటర్‌లో పోస్టు చేశాడు. దీనిని చూసిన నెటిజన్లు సరదాగా ఫన్నీ రియాక్షన్స్‌ కామెంట్‌ సెక్షన్‌లో పెడుతున్నారు.

అతని స్థానంలో మీరు డేటింగ్‌కి వెళ్లండి అని ఒకరు, లవర్‌ బాయ్‌ని ఎమ్మెల్యేగా గెలిపించాలని మరొకరు, అతనికి వెంటనే ఉద్యోగం ఇప్పిస్తే గర్ల్‌ ఫ్రెండ్‌కు ఖర్చు చేసేందుకు చేతిలో డబ్బు ఉంటుందని ఇంకొకరు.. ఇలా రకరకాల సలహాలు ఇచ్చారు. అయితే మన ఎమ్మెల్యే గారు మాత్రం సదరు లవర్‌ బాయ్‌కి ఓ సూచన చేశారు. వెంటనే ది ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అలోన్ అనే పుస్తకాన్ని చదవమని సలహా ఇచ్చాడు. లేదంటే తన తల్లిదండ్రులు చూసిన మరో యువతిని పెళ్లి చేసుకోవాలని రెండో అప్షన్‌ కింద సూచించారు. ఎమ్మెల్యే స్పందన చూసిన నెటిజన్లు.. ఆ యువకుడు జీవితంలో కఠినమైన పాఠాలను నేర్చు కోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఎమ్మెల్యేగారి ఆ వినతిని పట్టించుకోవద్దని కొందరు నెటిజన్లు సలహా ఇస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ నాగాలాండ్‌ కుర్రాడి ప్రేమ వ్యవహారం తెగ నెట్టింట వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ కథనాల కోసం క్లిక్‌ చేయండి.