Nagaland Firing: ఉగ్రవాదులుగా భావించి కూలీలపై భద్రతా బలగాల కాల్పులు.. పలువురు పౌరుల మృతి

|

Dec 05, 2021 | 8:28 AM

నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

Nagaland Firing: ఉగ్రవాదులుగా భావించి కూలీలపై భద్రతా బలగాల కాల్పులు.. పలువురు పౌరుల మృతి
Breaking
Follow us on

శనివారం సాయంత్రం నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలోని తిరు గ్రామానికి సమీపంలో జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. వాహనంపై కూలీల బృందం తిరు గ్రామం నుండి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులుగా భావించి భద్రతా దళాలు వాహనంపై కాల్పులు జరపడంతో ప్రాణాలను కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. సంఘటన తర్వాత ఆగ్రహించిన స్థానికులు కొన్ని భద్రతా దళాలకు సంబంధించి వాహనాలకు నిప్పు పెట్టారు.

అంతకు ముందు నాగాలాండ్‌లో ఉగ్రవాదుల ఘాతుకానికి తెగబడ్డారు. భద్రతా బలగాలపై మాటు వేసి దాడి చేశారు. మోన్ జిల్లా ఓటింగ్ గ్రామం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భద్రతా దళాలు సైతం కాల్పులకు తెగబడ్డారు. అయితే, అదే సమయంలో అటుగా వస్తున్న కూలీల వాహనంపై కాల్పులు జరపడంతో ఆరుగురు పౌరులు ప్రాణాలను కోల్పోయారు. ఆగ్రహించిన స్థానికులు జవాన్ల వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో మాన్ జిల్లాలో ఓటింగ్ ప్రాంతం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టింది.


ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.