బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె అనుమానాస్పద మృతి! గొంతులో ఆహారం ఇరుక్కుని..

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని ప్రతాప్‌గఢ్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర మౌర్య కుమార్తె అనుమానాస్పదంగా మృతి చెందింది. వివరాల్లోకెళ్తే..

బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె అనుమానాస్పద మృతి! గొంతులో ఆహారం ఇరుక్కుని..
Mla Daughter

Updated on: Aug 28, 2022 | 7:59 PM

MLAs daughter died: ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని ప్రతాప్‌గఢ్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర మౌర్య కుమార్తె అనుమానాస్పదంగా మృతి చెందింది. వివరాల్లోకెళ్తే.. 2017లో ఎమ్మెల్యే కుమార్తె పూనమ్ మౌర్యకు సాఫ్ట్‌వేర్ ఇంజనీరైన సంజయ్ మౌర్యతో వివాహం జరిగింది. ఈ దంపతులు మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని అయోధ్య నగర్‌లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో గత గురువారం (ఆగస్ట్‌ 25) ఉదయం నిద్రలేచే సమయానికి పూనమ్ మౌర్య పడుకున్న మంచంపై అపస్మారక స్థితిలో పడిఉన్నట్లు భర్త సంజయ్‌ గుర్తించాడు. వెంటనే సమీపంలోని హమీదియాను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పూనమ్‌ నిద్రసమయంలో గురకకారణంగా ఆహారం గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక మరణించినట్లు పోస్టుమార్టం రిపోర్టు తెల్పింది. ఎమ్మెల్యే కుమార్తె మృతిపై పలు అనుమానాలు తలెత్తడంతో పోలీసులు పోస్టుమార్టంను వీడియో తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు ఫైల్‌ చేసి ధర్యాప్తు చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us