మయన్మార్ లో మళ్ళీ నిరసన జ్వాలలు, సైనికుల కాల్పుల్లో 60 మందికి పైగా మృతి

| Edited By: Phani CH

Mar 27, 2021 | 9:03 PM

మయన్మార్ లో శనివారం జరిగిన హింసాకాండలో 60 మందికి పైగా మరణించారు. అనేకమంది గాయపడ్డారు. యాంగాన్, మండలే,  ఇతర టౌన్లు, నగరాల్లో భారీ సంఖ్యలో ఆందోళనకు దిగినవారిపై సైనికులు, పోలీసులు కాల్పులు జరిపారు.

మయన్మార్ లో మళ్ళీ నిరసన జ్వాలలు, సైనికుల కాల్పుల్లో 60 మందికి పైగా మృతి
Myanmar Security Forces Shot Dead More Than 60 Protesters
Follow us on

మయన్మార్ లో శనివారం జరిగిన హింసాకాండలో 60 మందికి పైగా మరణించారు. అనేకమంది గాయపడ్డారు. యాంగాన్, మండలే,  ఇతర టౌన్లు, నగరాల్లో భారీ సంఖ్యలో ఆందోళనకు దిగినవారిపై సైనికులు, పోలీసులు కాల్పులు జరిపారు. ఓ బాలుడితో బాటు ఈ హింసలో 60 మందికి పైగా మృతి చెందారని, వందలమంది గాయపడ్డారని, మయన్మార్ చరిత్రలో ఇదొక చీకటి రోజని విదేశీ పత్రికలు పేర్కొన్నాయి. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చ్చునని తెలిపాయి. అనధికారిక వార్తల  ప్రకారం 90 మంది మృతి చెందినట్టు భావిస్తున్నారు.    ‘బ్లడిఎస్ట్ డే, డే ఆఫ్ షేమ్’ అంటూ ఈ ఘటనను విదేశీ పత్రికలు అభివర్ణించాయి .. . మృతులు, గాయపడినవారితో అనేక వీధులు రక్తమోడుతూ కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దేశంలో సైనిక  ప్రభుత్వం గద్దె దిగాలని, ప్రజానేత ఆంగ్ సాన్ సూకీని వెంటనే  విడుదల చేయాలనీ ఆందోళనకారులు కోరుతున్నారు. ఇప్పటివరకు జరిగిన హింసలో 400 మంది మరణించారని తెలుస్తోంది.  నిరసనకారులను నిర్దాక్షిణ్యంగా అణచివేయాలని సైనిక ప్రభుత్వం తమ సోల్జర్లకు, పోలీసులకు ఆదేశాలిచ్చింది. వారిని కాల్చి చంపవచ్చ్చునని పేర్కొంది. అటు నిరసనకారులు కూడా వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితి జటిలమైంది. వారు కృత్రిమ ఎయిర్ గన్స్, ను , చివరకు విల్లంబులను కూడా వాడుతున్నారు.

కాగా-ఇళ్లలోని వారిని కూడా సైన్యం వదలడంలేదని, మహిళలు, పిల్లలని కూడా చూడకుండా కాల్పులు జరుపుతున్నారని వివిధ కుటుంబాలు విలపిస్తున్నాయి.   మయన్మార్ నుంచి చివరకు తమ పై అధికారుల ఆదేశాలను నిరాకరించి పలువురు పోలీసులు ఇండియాకు దొంగచాటుగా పారిపోయి వస్తున్నారు. మిజోరం చేరిన వీరిని తాత్కాలిక శరణార్ధులుగా భావిస్తున్నారు. అటు అమెరికా కూడా వీరికి తాత్కాలికంగా ఆశ్రయం కల్పిస్తామని అంటోంది.

 

మరిన్ని ఇక్కడ చదవండి:Government officer Bribery : ఇదీ.. కొందరి ప్రభుత్వ అధికారుల పనితనం, పుష్కలంగా జీతాలున్నా.. కోట్లలో లంచం సొమ్ము కూడబెట్టకుంటున్న వైనం

Telangana: తెలంగాణలో భారీగా అదనపు కలెక్టర్ల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం