సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు మాతృవియోగం జరిగింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న రెహమాన్ తల్లి కరీమా బేగం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా సోమవారం కరీమా బేగం కన్నుమూశారు. దీంతో రెహమాన్ కుటుంబంలో తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. కాగా కరీమా బేగం భర్త ఆర్కే శేఖర్ రెహమాన్ తొమిదేళ్ళ వయసులోనే మరణించారు. కరీమా బేగం, శేఖర్ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో రెహమాన్ చిన్నవాడు. రెహమన్ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖలు ప్రార్థిస్తున్నారు. 2020లో వరుస విషాదాలు సినీ ఇండస్ట్రీని వెంటాడుతున్నాయి.