Train Accident: స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు.. ఇద్దరు విద్యార్థులు మృతి!

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్‌ బస్సు రైల్వే క్రాసింగ్ దాటుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన ట్రైన్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ముగ్గురు మరణించగా.. వారిలో ఇద్దరు విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. సామాచారంతో ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Train Accident: స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు.. ఇద్దరు విద్యార్థులు మృతి!
Train Accident

Edited By:

Updated on: Jul 17, 2026 | 10:53 AM

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సును రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిగా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించారు. లెవెల్ క్రాసింగ్ వద్ద భద్రతా నిబంధనలు పాటించాయా? సిగ్నలింగ్‌లో ఏమైనా లోపం జరిగిందా? లేదా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, గాయపడిన విద్యార్థుల ఖచ్చిత సంఖ్య, అధికారిక సమాచారం కోసం అధికారులు మరింత సమాచారం విడుదల చేయాల్సి ఉంది.

ప్రమాదానికి సంబంధించిన వీడియో 

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us