వామ్మో మహానటి.. ప్రియుడి కోసం భర్తనే ఇరికించింది.. పోలీసుల ఎంట్రీతో బయటపడిన బండారం..

ముంబైలోని ఒక మహిళ తన భర్త ఇంట్లోని బంగారు నగలను కొట్టేశాడని ఆరోపించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరి సెల్ ఫోన్స్ చెక్ చేశారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో భర్తతో సహా అంతా అవాక్కయ్యారు.

వామ్మో మహానటి.. ప్రియుడి కోసం భర్తనే ఇరికించింది.. పోలీసుల ఎంట్రీతో బయటపడిన బండారం..
Mumbai Woman Sells Jewelry For Lovers

Updated on: Sep 13, 2025 | 1:43 PM

గత కొన్నాళ్లుగా వివాహేతర సంబంధాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రియుడు కోసం భర్తలను చంపడం ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. అయితే లవర్‌ కోసం ఓ మహిళ చేసిన పని వైరల్‌గా మారింది. దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇంట్లోని నగలు అమ్మి, ఆ సొమ్మును ప్రియుడికి ఇచ్చి ఆ తర్వాత భర్తపై దొంగతనం ఆరోపణలు చేసిన మహిళ కథ ఇప్పుడు ముంబైలో చర్చనీయాంశంగా మారింది.  ముంబైకి చెందిన రమేష్, ఊర్మిళ దంపతులకు 18 ఏళ్ల కూతురు ఉంది. ఊర్మిళ అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా ఆమె కూతురి ప్రియుడితో కూడా సంబంధం కొనసాగించింది. ఈ క్రమంలో తన లవర్స్‌తో కలిసి ఒంటరిగా జీవించాలనుకుంది. దీన్ని కోసం ఓ కన్నింగ్ ప్లాన్ వేసింది. ఇంట్లో ఉన్న బంగారు నగలను అమ్మేసి రూ.10లక్షలను లవర్‌కు ఇచ్చింది.

తన భర్తకు నగలు ఇంట్లో లేవని తెలిస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన ఊర్మిళ.. మరో ప్లాన్ వేసింది. తన భర్త రమేష్‌పై దొంగతనం ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్తే నగలు అమ్మి డబ్బులు తీసుకున్నాడని పోలీసులకు చెప్పింది. ఊర్మిళ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంటికి వెళ్లి పరిశీలించినప్పుడు దొంగతనం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వారికి అనుమానం కలిగింది. దీంతో పోలీసులు రమేష్, ఊర్మిళ సెల్ ఫోన్లను చెక్ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది.

ఊర్మిళ ఇద్దరితో వివాహేతర సంబంధం కలిగి ఉందనే విషయం బయటపడింది. అంతేకాకుండా ఇంట్లో ఉన్న నగలను దొంగిలించి, అమ్మి, ఆ డబ్బును ఆమె తన లవర్స్‌కు ఇచ్చిందని పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు విచారణలో మరిన్ని విషయాలు బయటపడతాయని భావిస్తున్నారు. ఈ ఘటన సమాజంలో నైతిక విలువల పతనాన్ని సూచిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..