Phone Addiction: అయ్యో ఏంటి ఇలా జరిగింది..తల్లిదండ్రులు ఫోన్ లాక్కున్నందుకు కూతురు ఏం చేసిందంటే

స్మార్ట్ ఫోన్లు వచ్చాక ప్రజల జీవన విధానమే మారిపోయింది. స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఒక రోజులో కొన్ని గంటల పాటు ఆ ఫోన్లు చూడటానికే సమయాన్ని వినియోగిస్తున్నారు నెటీజన్లు.

Phone Addiction: అయ్యో ఏంటి ఇలా జరిగింది..తల్లిదండ్రులు ఫోన్ లాక్కున్నందుకు కూతురు ఏం చేసిందంటే
Mobile Phone

Updated on: Apr 11, 2023 | 11:25 AM

మొబైల్ ఫోన్లు వచ్చాక ప్రజల జీవన విధానమే మారిపోయింది.  అసలు ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఒక రోజులో కొన్ని గంటల పాటు ఆ ఫోన్లు చూడటానికే సమయాన్ని వినియోగిస్తున్నారు నెటీజన్లు. ప్రస్తుతం కొంతమంది చిన్నపిల్లలైతే ఆ ఫోన్లో వీడియోలు చూపించనిదే అన్నం తినడం లేదు. మరికొంతమంది టీనేజీ యువత ఫోన్ కొనివ్వాలంటూ తల్లిదండ్రులపై మారాం చేస్తుంటారు. అయితే ముంబయిలోని మల్వాని ప్రాంతంలో ఓ 15 ఏళ్ల యువతి తన తల్లిదండ్రులు ఫోన్ వాడనియ్యడం లేదంటూ ఏడంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె తల్లిదండ్రులను ఆచూకి కనిపెట్టారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానకి గల కచ్చితమైన కారణం తెలియకపోయినప్పటికీ.. ఆ యువతి మొబైల్ ఫోన్ ను ఆమె తల్లిదండ్రులు లాక్కున్నారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆ యువతి మనస్తాపం చెందిందని.. ఈ కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం.