Breaking: ఆ ట్యాంకర్‌లో RDX ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్.. పోలీసులు అడ్డగించి చెక్ చేయగా

|

Jul 23, 2023 | 4:55 PM

మహారాష్ట్రలో ఆర్డీఎక్స్‌ కలకలం చెలరేగింది. అనుమానిత ఆర్డీఎక్స్‌తో గోవా వెళ్తున్న ట్యాంకర్‌ను ముంబై పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరు ఉగ్రవాదులు ఆర్డీఎక్స్‌ను గోవాకు తీసుకెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

Breaking: ఆ ట్యాంకర్‌లో RDX ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్.. పోలీసులు అడ్డగించి చెక్ చేయగా
Tanker
Follow us on

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అనుమానాస్పద ట్యాంకర్‌ను పోలీసులు సీజ్ చేశారు. శనివారం రాత్రి రత్నగిరి పోలీసులు అనుమానాస్పద ట్యాంకర్‌ను అడ్డుకున్నారు. పేలుడు పదార్థం ఆర్డీఎక్స్‌ను ట్యాంకర్ ద్వారా గోవాకు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ప్రస్తుతం ట్యాంకర్ డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోనే ఉన్నాడు. అనుమానాస్పద ట్యాంకర్‌ గురించి గుర్తుతెలియని వ్యక్తి పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌లో సమాచారం అందించాడు. ట్యాంకర్‌లో ఇద్దరు పాకిస్థానీ వ్యక్తులు కూడా ఉన్నారని కూడా కాల్ చేసిన వ్యక్తి చెప్పాడని ముంబై పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ట్యాంకర్ డిజైన్, వాహనం నంబర్, కలర్ ఇలా పూర్తి సమాచారాన్ని అందించాడు. అతడిచ్చిన ఇన్పర్మేషన్‌తో రంగంలోకి దిగి.. పోలీసులు ట్యాంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

 ట్యాంకర్‌ను పరిశీలిస్తున్న నిపుణుల బృందం

స్వాధీనం చేసుకున్న ట్యాంకర్‌లో ఏదో రసాయనం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అది ఏంటి అన్నది నిర్ధారించేందుకు నిపుణుల బృందాన్ని పిలిపించారు. ట్యాంకర్‌లో పేలుడు పదార్థం ఆర్‌డీఎక్స్‌ ఉందా లేదా అనే దానిపై మరికొద్దిసేపట్లో స్పష్టత రానుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..