మన దేశంలో నిత్యం ఎన్నో రైలు ప్రమాద ఘటనలు జరుగుతుంటాయి. పట్టాలు దాటుతుండగా కొందరు… కదులుతున్న రైలు నుంచి పడిపోయి మరికొందరు.. ప్రమాదాల బారినపడుతుంటారు. తాజాగా అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలు కింద పడబోయిన ఓ చిన్నారిని రైల్వే పోలీసులు కాపాడారు. ఈ ఘటన ముంబయిలోని మన్‌కుర్ద్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ముంబయిలోని మన్‌కుర్ద్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఓ మహిళ చిన్నారిని ఎత్తుకుని రెండవ నంబర్ ప్లాట్‌ఫాంపైకి వచ్చింది. అక్కడున్న లోకల్ ట్రైన్‌ను ఎక్కింది. రద్దీ కారణంగా రైలు కదులుతున్న సమయంలో ఆమె పట్టుకోల్పోయింది. ఈ క్రమంలో మహిళ చేతిలోని చిన్నారి జారి రైలు కింద పడబోయింది. అక్కడే ఉన్న రైల్వే పోలీసు అక్షయ్ సోయ గమనించి చిన్నారి రైలు కిందపడకుండా కాపాడాడు.
#MissionJeevanRaksha आज अपराध शाखाके अक्षय सोये द्वारा मानखुर्द रेलवे स्टेशनके प्लेटफार्म 2 पर लोकल ट्रेनमें महिला यात्री गोदमें छोटे बच्चेको लेकर चढ़ते समय असंतुलित होकर गिरनेपर बच्चेको पकड़कर सूझबूझसे बच्चेकी जान बचाया @RailMinIndia @RPFCR @RPF_INDIA pic.twitter.com/gBCWulYylo
— RPF Mumbai Division (@RPFCRBB) November 1, 2022
కొంత దూరం వెళ్లాకా సదరు మహిళను అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు కాపాడాడు. ఇందుకు సంబంధించిన దృష్యాలు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అక్షయ్ సాహసంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి