Mumbai Auto Driver Desraj : వయసులో ఉన్నప్పుడు కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేసి… వారికంటూ ఓ జీవితాన్ని ఇచ్చాకా ఏ తల్లిదండ్రులైనా విశ్రాంతిగా చివరిజీవితం గడపాలని కోరుకుంటారు అయితే కొడుకులను పెంచి పెద్దచేసి పెళ్లిళ్లు చేసి భాద్యతలు తీర్చుకుని మలి సంధ్యవేళలో మనవళ్లతో హాయిగా గడపాలి అనుకున్న ఓ వ్యక్తి.. ఇప్పుడు అనుకున్నదానికి విరుద్దంగా జీవిత చరమాంకంలో కూడా రాత్రింబవళ్లు ఆటో నడుపుతూ తాను తిని తినక కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. దెస్రాజ్.. అతని గురించి తెలియాలంటే..
ముంబై కు చెందిన దేస్రాజ్ ఆటో నడుపుతూ తన ఇద్దరు కుమారులను పెంచి పోషించి పెద్ద చేశాడు.. అనంతరం పెళ్లిళ్లు కూడా చేశాడు.. అయితే ఆరేళ్ళ పని కోసం వెళ్లిన పెద్ద కొడుకు ఓ వారం తర్వాత శవమై కనిపించాడు.. చేతికంది వచ్చిన కొడుకు తన కళ్ళముందే మరణిస్తే ఆ బాధను దిగమింగి మళ్ళీ కుటుంబ పోషణ కోసం ఆటో నడపడం మొదలు పెట్టాడు. ఈ బాధనుంచి కోలుకోక ముందే దెస్రాజ్ కు మళ్ళీ దెబ్బ తగిలింది.. ఈ సారి రెండో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేళ్ల వ్యవధిలోనే ఇద్దరు కొడుకులను పోగొట్టుకున్న ఆ తండ్రి బాధ వర్ణించడానికి కూడా మాటలు చాలవు. అయితే దేస్రాజ్ తన కొడుకు అర్ధాంతరంగా వదిలేసిన బాధ్యతలను తాను మోయాలనుకున్నాడు..
కుమారుల మరణంతో ఒంటరి వాళ్లైన తన కోడళ్లు, నలుగురు మనవలు, మనవరాళ్ల బాధ్యత భుజానకెత్తుకున్నాడు.
అయితే తాత కష్టాన్ని చూసిన తొమ్మిదవ తరగతి చదువుతున్న మనవరాలు తాను చదువు మానేసి.. పనికి వెళ్తానంది. అయితే చదువుకోవాల్సిన వయసులో మనవరాలు పనికి వెళ్ళతాననడం దెస్రాజ్ కు నచ్చలేదు. ఆ క్షణమే ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనవరాలి చదువుకు ఆటంకం కలగకూడదనుకున్నాడు. కోరుకున్న చదువు చెప్పిస్తానని మనవరాలికి మాట ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి తాత మరింత కష్టపడడంమొదలు పెట్టాడు. ఉదయం ఆరు గంటలకు ఆటోతో ఇంటి నుంచి బయటకు వెళ్తే రాత్రి పదింటికి తిరిగి వచ్చేవాడు. అలా నెలంతా కష్టపడి 10 వేల రూపాయలు సంపాదిస్తే.. దానిలో ఆరు వేలు మనవరాలి చదువు కోసం ఖర్చు చేస్తే… మిగతా సొమ్ము కుటుంబ సభ్యుల తిండి కోసం కేటాయించేవాడు. తాత తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టింది దేస్రాజ్ మనవరాలు. ఇంటర్‌లో 80 శాతం తో పాస్ అయ్యింది. మనవరాలి ప్రతిభచూసిన తాత సంతోషంతో పొంగిపోయాడు. రిజల్ట్ వచ్చిన రోజున ఆటోలో అందరినీ ఫ్రీగా దింపాడు.. తన మనవరాలి చదువుగురించి చెప్పి మురిసిపోయాడు.
అయితే మనవరాలు తాతను తనకు బీఈడీ చదువుకోవాలని ఉందని ఢిల్లీ వెళ్తానని అడిగింది. అయితే అది ఖర్చుతో కూడుకున్నది అయినా సరే మనవరాలి కోరిక తీర్చాలన్న తాత ఉన్న ఒక్క ఇల్లును అమ్మేశాడు..కుటుంబాన్ని బంధువుల ఇంటికి పంపించాడు.అక్కడే ఉండే ఏర్పాట్లు చేశాడు. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో మనవరాలిని ఢిల్లీ పంపించాడు. ఇక తాను ఆటోనే ఇల్లుగా చేసుకుని జీవితం గడుపుతున్నాడు. ఇది తెలుసుకున్న హ్యుమన్స్ ఆఫ్ బాంబే దేస్రాజ్ తో మాట్లాడారు. ఇంత కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.. ఎప్పుడు బాధ అనిపించలేదా అని అడగగా.. అందుకు తాత దెస్రాజ్ తనకు ఊహ తెలిసినప్పటి నుంచి కష్టపడడమే తెలుసుకు అదే అలవాటయ్యింది. ఈ వయసులో కూడా కష్టపడుతూ తన కుటుంబం కోసమే కదా. తన మనవరాలు బాగా చదువుతోంది. ఇక బాధ ఎందుకు అని తిరిగి వారినే నవ్వుతూ ప్రశ్నించాడు.
నా మనవరాలు ఇటీవలే ఫోన్ చేసింది.. తను క్లాస్ ఫస్ట్ వచ్చానని చెప్పింది. దీంతో నేను పడిన శ్రమ అంతా మర్చిపోయాను. తను తప్పకుండా టీచర్ అవుతుంది. ఆ రోజు తనను దగ్గరుకు తీసుకుని ‘‘నన్ను గర్వపడేలా చేశావ్ తల్లి’’ అని ఆశీర్వదిస్తాను. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు దేస్రాజ్. తానే మా ఇంట్లో మొదటి డిగ్రీ చదివిన వ్యక్తి అవుతుందని చెప్పాడు. దేస్రాజ్ జీవిత కథను హ్యూమన్స్ ఆఫ్ బాంబే గురువారం తన ఫేస్‌బుక్ పేజిలో షేర్ చేసింది.
తాత నవ్వుతు పడుతున్న కష్టాన్ని చదివిన వారందరూ స్పందిస్తున్నారు. కన్నీరు ఆగడంలేదు .. కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నావ్.. యువతలో ఉన్న ఎందరో సోమరిపోతులకన్నా మీరు వంద రేట్లు నయం. తప్పక మీ మనవరాలు టీచర్ అవుతుంది.. మీ పేరు నిలబెడుతుంది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు నెటిజనులు దేస్రాజ్‌కు ఆర్ధిక సాయం చేయడానికి ముందుకొచ్చారు. గుంజర్ రాటి దేస్రాజ్ పేరు మీద ఓ ఫేస్ బుక్ యూజర్ ఫండింగ్ స్టార్ట్ చేసారు. వెంటనే చాలా మంది స్పందించారు. తాత అండగా ఉంటామంటూ.. దాదాపు 270 మంది రూ. 5.3 లక్షలను దేస్రాజ్ కోసం ఇచ్చారు. ఇది తెలుసుకున్న కాంగ్రెస్ నాయకురాలు అర్చనా కూడా స్పందించారు.. తన ట్విట్టర్‌లో దేస్రాజ్ ఆటో నంబర్, మొబైల్ నంబర్, అతడు పని చేసే ప్రాంతం వివరాలు షేర్ చేశారు. ఆయనకు సాయం అందించడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Also Read: