Varavara Rao Bail Petition: విరసం నేత వరవరరావు బెయిల్‌ పిటిషన్‌పై ముంబై హైకోర్టులో విచారణ

Varavara Rao Bail Petition: విరసం నేత వరవరరావు బెయిల్‌ పిటిషన్‌పై బుధవారం ముంబై హైకోర్టు విచారణ చేపట్టింది. వరవరరావు ఆరోగ్యం బాగాలేదని, బెయిల్‌ మంజూరు...

Varavara Rao Bail Petition: విరసం నేత వరవరరావు బెయిల్‌ పిటిషన్‌పై ముంబై హైకోర్టులో విచారణ

Updated on: Jan 13, 2021 | 5:37 PM

Varavara Rao Bail Petition: విరసం నేత వరవరరావు బెయిల్‌ పిటిషన్‌పై బుధవారం ముంబై హైకోర్టు విచారణ చేపట్టింది. వరవరరావు ఆరోగ్యం బాగాలేదని, బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన భార్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వరవరరావు వయసు, ఆరోగ్యం పరిగణలోకి తీసుకోవాలని ఎన్‌ఐఏ, మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. మనమంతా మనుషులమన్న విషయాన్ని మర్చిపోవద్దని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

కాగా, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కేసులో అరెస్టు అయిన వరవరరావు  హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ముంబై నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం తామే భరిస్తామని గతంలోనే మహారాష్ట్ర సర్కార్‌ కోర్టుకు తెలిపింది.

Strain Virus: కలవరపెడుతున్న కొత్త రకం స్ట్రెయిన్‌ వైరస్‌.. భారత్‌లో 102కు చేరిన పాజిటివ్‌ కేసుల సంఖ్య