Mumbai Drugs: దేశంలో డ్రగ్స్ మాఫియా కలకలం.. ముంబై ఛత్రపతి శివాజీ విమానంలో భారీ పట్టుబడిన డ్రగ్స్..

|

Feb 13, 2022 | 1:33 PM

Drugs Recovered: దేశంలో డ్రగ్స్‌ మాఫియా రెచ్చిపోతోంది. జోరుగా డ్రగ్స్‌ దందాకు పాల్పడుతోంది. దేశంలో యువతే టార్గెట్‌గా మత్తు పదార్థాలను సప్లై చేస్తోంది. ఇందుకోసం సరికొత్త..

Mumbai Drugs: దేశంలో డ్రగ్స్ మాఫియా కలకలం.. ముంబై ఛత్రపతి శివాజీ విమానంలో భారీ పట్టుబడిన డ్రగ్స్..
Follow us on

Drugs Recovered: దేశంలో డ్రగ్స్‌ మాఫియా రెచ్చిపోతోంది. జోరుగా డ్రగ్స్‌ దందాకు పాల్పడుతోంది. దేశంలో యువతే టార్గెట్‌గా మత్తు పదార్థాలను సప్లై చేస్తోంది. ఇందుకోసం సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. లేటెస్ట్‌గా ముంబై ఎయిర్‌పోర్టులో బారీగా హెరాయిన్‌ పట్టుబడింది. దాదాపు 60 కోట్ల విలువైన మత్తు పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకెళితే.. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జింబాబ్వే నుంచి వచ్చిన మహిళ వద్ద పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ పట్టుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. హెరాయిన్‌, వైట్‌ క్రిస్టల్‌ గ్రాన్యూల్స్, మెథమ్‌ పి. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 60 కోట్ల రూపాయలుంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. జింబాబ్వే మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఇక అర్థరాత్రి గుజరాత్‌ తీరంలో మళ్లీ డ్రగ్స్‌ కలకలం రేగింది. రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుకున్నారు అధికారులు. ఎన్సీబీ, నేవీ జాయింట్‌ ఆపరేషన్‌లో ఈ డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టయింది. మొత్తం 800 కేజీల డ్రగ్స్‌ సీజ్‌ చేశారు. మరోవైపు వారం క్రితం భారత్- పాకిస్థాన్ సరిహద్దులో భారీగా హెరాయిన్‌ సీజ్‌ చేశారు. 14 కిలోలకుపైగా హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దీని విలువ రూ. 35 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేశారు. పాకిస్థాన్​గుండా భారత్​లోకి ఈ డ్రగ్స్​సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. బీఎస్‌ఎఫ్‌, రాజస్థాన్‌ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌లో ఈ హెరాయిన్‌ పట్టుబడింది. ఇక ఇటీవల మహారాష్ట్ర పాల్ఘర్‌ జిల్లాలోనూ.. 25కోట్ల రూపాయల హెరాయిన్‌ పట్టుబడింది.

Also read:

Catherine Tresa: కాటుక కళ్ళతో కవ్విస్తున్న ‘కేథ‌రిన్ థ్రెసా’ లేటెస్ట్ ఫొటోస్…

JIO: జియో ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ యాక్సెస్.. అపరిమిత డేటా, కాల్స్‌..?

Traffic Rules: ‘ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే తప్పేం కాదు’.. కానీ షరతులు వర్తిస్తాయంటున్న కేంద్ర మంత్రి..